పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

19

కొండ్డ పాటూరు

కై ఫియ్యతు మౌజే కొండ్డపాటూరు పరగణే వినికొండ్డ సర్కారు మృతు౯

జాంన్నగరు. రాజా మల్రాజు వెంక్కట గుండ్డా రావు సరు దేశముఖు

మన్నేవారు.

ఈ గ్రామాన్కు పూర్వం నుంచ్చి కొండ్డ పాటూరు అనే పేరు వుంన్నది. కలియుగ ప్రవేశమయ్ని తర్వాతను యుధిష్ఠిర శక గత సంవత్సరంబులు ౧౮౧౫ శకం (1903 AD) వర్కు చాళుక్య వంశీకుడై నఘువంటి విష్ణు వద౯న మహారాజు రాజమహేంద్రవరం రాజధానిగా వసియించ్చి రాజ్యం చేస్తూ మంత్రి సామంత్త ప్రధాన సేనాపతి సేనా సమేతంగ్గా దిగ్విజయాద౯మై బయల్దేరి నరేంద్ర వర వాహనుడై సమస్త దేశములు సాధించ్చి అక్కడి నుంచ్చి బయల్ దేరి నొకానొక సమయమందు యిక్షుపురి ప్రతి నామధేయమయ్ని చేర్కూరు ప్రవేశించి శ్రీ త్రివిక్రమ స్వామి వారి దరిశినం చేశి శ్రీ స్వామి వారికి చర్కూరు పొలంలో గ్రామాన్కు

తూపు౯భాగం వుండ్రాల పాలెం ఖండ్రికే వ ౧ కి కుచ్చళ్లు ౩౫
దక్షిణ భాగం వోబుసాని పాలెం ఖండ్రికె వ ౧ కి కుచ్చళ్ళు ౩౫
                                                  ———
                                                  ౭౦

కుచ్చళ్లుంను మరింన్ని కసుకుత్తి౯, యినగత్తి౯, కొండ్డపాటూరు అనే గ్రామములు మూడుంన్ను అగ్రహారములు చేసి త్రివిక్రమపుర త్రయములని నామాంక్కితం చేశి యుధిష్ఠర శకం ౧౮౨౬ శక (1904 AD) మంద్దు ధారా గ్రహితం చేశినారు. గన్కు బహు దినములు జరిగెను. ......యది యుదిష్ఠిర శక వృత్తాంతం.

విక్రమ శక మతిక్రమించ్చి శాలివాహన శక ప్రవేశ మయి యే తథక గతవత్సరంబులు ౧౦౫౫ (1133 AD) జరిగిన మీదట శాలివాహన ౧౦౫౬ శకం (1134 AD) మొదలుకొని గజపతి శింహ్వాసనస్తుడయ్ని గణపతి దేవమహారాజు రత్న శింహ్వసనాసీనుడై పృథివీరాజ్యము చేయుచుండ్డగ్గారు. వీరి దగ్గర మహాప్రధానులయ్ని గోపరాజు రామంన్నగారు శాలీవాహనం ౧౦౬౭ శక (1145 AD) మందు సమస్తమయ్ని నియ్యోగులకు గ్రామ కరిణీకపు మిరాశీలు నిన౯యించే యడల కొండపాటూరి వెలనాడు కౌండ్డిన్యస గోతృలయ్ని గంఢవాహిని తిక్కనకు యేక భోగంగ్గా గ్రామ కరిణీకపు మిరాశి యిప్పించ్చినారు గనుక అతను గ్రామ కరిణీకం అనుభవిస్తూ వుండి శ్రీ శైల యాత్ర వెళ్ళిన వారయి మల్లికాజు౯న స్వామి వారిని దరిశనం చేశి అక్కడి నుంచ్చి లింగ్డమూర్తిని తీసుకుని వచ్చి కొండ్డపాటూరు ప్రవేశించ్చి