పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

17

కాట్రపాడు

కైఫియ్యతు మౌజే కాట్రపాడు సంతు గుంట్టూరు సర్కారు ముతు౯

జాంన్నగకు తాలూకే రాచూరు రాజా మల్రాజు వెంక్కటా గుండ్డారావు.

యీ గ్రామాన్కు పూర్వం నుంచ్చి కాట్రపాడు అనే పేరు వుంన్నది. గజపతి శింహ్వాసనస్తుడయ్ని' గణపతి మహారాజు ప్రభుత్వం చేశేటప్పుడు వీరి దగ్గర మహా ప్రధానులయి గోపరాజు రామంన్నగారు. శా ౧౦౬౭ శకం (1145 AD)లో సమస్తమయ్ని నియ్యోగులకు గ్రామ మిరాశీలు నిన౯యించ్చే యడల యీ కాట్రపాట్కి వెలనాడు కౌశిక గోతృలయ్ని కొండ్రాజు ఏకభోగంగ్గా మిరాశీ యిచ్చినారు. గన్కు గ్రామ నామం కాట్రపాటి వారనే అభిదానం చేతను అనుభవిస్తూ వుంన్నారు.

వడ్డెరెడ్డి కనా౯టకములు జరిగిన తర్వాతను మొగలాయి ప్రభుత్వంలో లింగ్డమల్లు లక్ష్మీనారాయణ అనే కోమటి గ్రామమధ్యమంద్దు విష్ణు స్తలం కట్టించ్చి, శా॥ ౧౫౨౦ శకం (1598 AD)లో వేణుగోపాలస్వామి వారిని ప్రతిష్ట చేశినారు గన్కు అప్పట్లో దేశస్తులు ఆమీలు చాతను యీ దేవునికి నిత్య నైవేద్య దీపారాధనలకు జరగగలంద్లుకు కు ౧౺౦ కుచ్చలంన్నర భూమి యినాం యిప్పించ్చినారు.

కొండవీటి శీమ సముతు బంద్దీలు చేశేటప్పుడు యీ గ్రామం గుంట్టూరి సముతులో దాఖలు చేసినారు. స్న ౧౧౨౨ ఫసలీ (1712 AD)లో కొండ్డవీటి శీమ జమిదాల౯కు పంచ్చి పెట్టే యడల యీ గ్రామం రమణయ్య మాణిక్యరాయనింగారి వంత్తు వచ్ని రేపల్లె తాలూకాలో దాఖలు అయ్నిది గన్కు రమణయ్యామాణిక్యారాయునింగారు ప్రభుత్వం చేశేటప్పుడు మజ్కూరి మిరాశీదారుడయ్ని కాట్రపాటి యల్లంరాజు గ్రామాన్కు వాయువ్యమంద్దు శివస్థలం కట్టించ్చి శ్రీ మల్లేశ్వరస్వామి వారనే లింగమూర్తి౯ ప్రతిష్ఠ చేశినాడు. గన్కు యీ దేవున్కి నిత్యనై వేద్య దీపారాధనలకు జరగగలంద్దుకు జమీదారు గారు కు ౧౪౦ కుచ్చలంన్నర భూమి యినాము యిప్పించ్చినారు. రమణయ్య మాణిక్యారాయునింగారు, మల్లంన్న గారు, శీతంన్నగారు, గోపంన్నగారు, స్న ౧౧౬౮ ఫసలీ (1758 AD) వరకు ప్రభుత్వం చేశ్ని తర్వాతను స్న ౧౧౬౯ ఫసలీ (1759 AD) లగాయతు జంగ్గన్న గారు ప్రభుత్వాన్కు వచ్చి స్న ౧౧౮౭ ఫసలీ (1773) వర్కు పదునాలుగు సంవత్సరములు అధికారం చేశ్ని తర్వాతను, తమ్ములయ్ని తిరుపతి రాయునింగారు సదరహి ఫసలీలో తాలూకా సఖం పంచ్చుకునే యడల యీ గ్రామం తిరుపతి రాయునింగారి వంత్త వచ్చి రాచూరి తాలూకా లొ దాఖలు అయ్నిది గన్కు తిరుపతిరాయునింగారు వీరి కొమారులయ్ని అప్పారాయునింగారు శీతంన్నాగారు స్న ౧౨౦౮ ఫసలీ (1798 AD) వర్కు అధికారం చేశ్ని మీదట జంగ్గంన్న