పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

204 వొణుకుబాడు కై ఫియ్యతు మ|| వొణుకుబాడు సంత్తునాదెండ్ల తాలూకే చింతపల్లి సర్కారు ముతు=జాంన్నగరు ౧౨౨౨ ఫసలీ (1817 AD) మజుకూరి కరణాలు దేవళ రాజు అప్పన్నయ్య యీ గోపరాజు వ్రాయించ్చినది. పూర్వం నుంచ్చి యీ గ్రామానకు వొణుకుబాడు అనేవాడికె వున్నది. తదనంతరం కొన్ని సంవ్వత్సరములకు కుళోత్తుంగ చోళ మహారాజు యీ దేశం ప్రభుత్వం చేస్తూ న్నూ యీ గ్రాము మధ్యమందు ఆలయం కట్టించ్చి రామేశ్వరుడనే లింగమూత్తికాని ప్రతిష్ఠ చే శాలివాహనం ౧౦౩౯ (1117 AD) శకం లగాయతు కొన్ని సంవత్సరములు రాజ్యం యేలిన మీదట గజపతి శింహ్వాసనస్తుడయ్ని గణపతి దేవమహారాజు ప్రభుత్వం చేశే యడల వీరి ప్రధానులయ్ని గోపరాజు రామంన్న మిరాశీలు నిన్నకాయించ్చే యడల కౌండ్డిన్యస గోతృలుంన్ను ఆపస్తంబసూత్రుల్ను సంప్పటం వారికి యేకభాగంగ్గా మిరాశీ నిన్నయించ్చి నారు గన్కు తత్సం త్తతివారు పరంపరా అనుభవిస్తూ వుంన్నారు. వడ్డెరెడ్డి కనాణాటక ప్రభుత్వం జరిగిన మీదట మొగలాయి ప్రభుత్వములో బారాముత సద్ధి వగైరా కాయిదాలు నిన్నజయించ్చే యడల మజ్కూరి కరణాలు అయిన సంప్పటం వారికి కొండవీటి శీమ స్తశం కరిణీకపు హోదా యిచ్చినారు గన్కు వారు యీ రెండ్డు హోదాల వల్లగజాంత్త ఐశ్వర్య సంపన్నులయి వుఁడ్డగా నుదురుబాటి యర్రయ్య అనేవాడు అగ్ని స్తంభన జలస్తంభన గరడేసాము మొదలైయ్ని విద్యను గ్రహించ్చి యీ సంప్పటి వారివద్దకు వచ్చి వీరి వద్ద నౌకరీ వుండ్డి త్న విద్యలు యావత్తూ చూపుతూ వుండి వకానొక కాలమందు అప్రమాణంచైతను కుటిల విద్యచైతను కారుముద్దుతూ వార్ని మొప్పించి వారి స్తళకరిణీకం హరించ్చినాడు గన్కు సదరహీ సంప్పటివారు గ్రామ కరిణీకపు హోదాలలో నేవుండి వున్నారు. అప్పట్లో యర్రయ్య అనేవాడు యీ గ్రామ మధ్యమంద్దు విస్తారమయ్ని చెర్వు తవ్వించ్చి జలస్తంభన భావి అనే పేరు పెట్టి యీ భావిలో ప్రతి నిత్యముంన్ను జలస్తంభన సాదనం చేస్తూ వుండేదట యిప్పుడు ఆ స్థశానకు జలస్తంభన భావి తరాలు వాడు కొంట్టుంన్నారు. స౦౦౨౨ ఫసలీ (1712AD)లో కొండవీటి రాజు జమీదాఁణుకు పంచ్చిపెట్టేయడల కొండ్డవీటి శీమ నాయకులయ్ని కటికవీటి వారు తాళ్లూరు వగైరా యేడు గ్రామాదులు ముఠాదేశి వాశిరెడ్డి పద్మనాభునింగ్గారి తాలూకాలో పోయి కాళీ చేశీవారికి జాహగీరు కింద యిచ్చినారు గను అప్పట్లో యీ గ్రామం తాళ్ళూరి పల్లెలో దాఖలు అయి కటికెనేని వారికి కొంన్ని దినాలు జాహగీరు కింద చెల్లుతూ వచ్చినది.