పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

185 జంగాలపల్లె కయిఫియ్యతు ముంజె జంగాలపల్లె వర్గణె రాజా మల్రాజు వెంక్కట గుఁడ్డారావు స్న వినుకోండ ముప్పాతికె వంట్టు జమీదారు ౨ ఫసలీ (1818 A.D.) ది మాచికా ౧౪ ఆ. న. ౧౮౧౯ (1819 AD.) సంవత్సరము బహుధాన్య నామ సంవత్సర ఫాల్గుణ బహుళ 3 ఆదివారం సర్కారు ముత్తుజా జాంన్నగరు జిల్లా గుంటూరు. కసుబా వినుకోండ గ్రామము పొలములో కేసరపాటికి పదహారు బాలకా పగ్గానకుచ్చల ౦ వకటింటికి అరవైనాల్గు ౬ళ కుంట్టల ప్రాప్తిని అయ్ని కుచ్చిళ్ళు అరవై అయిదుంన్నూ ముంజే పెదకంచల గ్రామము పొలములోను యిరువై కుచ్చిళ్ళు జ్ములా ౪౫ నలుబై అయిదు కుచళ్ళ పొలం హాయిదరాబాద్ రాజధానియందు తానేషాః పాదుషాః వారు ప్రభుత్వం చేస్తూవుండే కాలమందు శ్రీశైల మఠపతి అయ్ని శంభులింగందేవర అనే జంగ్డముకు సదరహి పొలం సర్వ మాన్యముగా పాదుషాః వారు దయ చేయించ్చినారు గన్కూ ఆ జంగ్లము తన మాన్యపు పొలములో గ్రామము యేప్పాటు చేసుకుని ఆ గ్రామాన్కి జంగ్గాలపల్లే అనే పేరు ప్రశస్తం చేశినాడు. తదారభ్యం ఆ జగ్గం సంతతివార్కి నూరు సంవ్వత్సరములు పర్యంతరం భుక్తి కింద వచ్చినది. ఆ సమయాన సదరు గ్రామానకు కణాజులు జంగ్గాలే యీ లాగ్ను నూరు సంవత్సర ములు జరిగిన తర్వాతను యీ జంగ్గాలు ఖిలమయి పోయ్నిందు, యీ గ్రామము అమానిలో వుఁడ్డగా యీ వినుకోండ్డ పర్గణాకు దేశపాండ్యాలు అయ్ని రాయని భాస్కరు అనేవారుంన్నూ గుంటుపల్లి ముత్తరాజు ఆయ్యవారున్నూ యీజా రెండు సంప్రతులు భాస్కరునివార్కి ముప్పాతికె వంట్టులన్ను గుఁట్టుపల్లి వార్కి పాతికె వఁట్టుంన్ను యీ ప్రకారాన్కు దేశపాండ్యాగిరి చేస్తూ వుండే యడల యీ గ్రామాస్కూ యజుశ్శాఖాధ్వాయులున్నూ గౌతమ గోతోద్భవులున్నూ వేమరాజు అయ్యప్ప రాజు అనే ఆరువేల నియ్యోగికి యేక భోగం కరిణీక మికాశీ ధారాగ్రహితంగాను దేశపాండ్యాల వారు యిచ్చినారు గన్కు తద్ద్వంశీజులే అనుభవిస్తూ వుంన్నారు. ఈ గ్రామాన్కు పొలిమేర హద్దులు : తూపుకు తోడేటి కొల్వుమీద మంచిపాటి పడ్మటి పొలిమేర - దక్షణ పొలిమేర గుండ్ల కమ్మ హద్దు పడమటి పొలిమేర వాగు పరియంత్తరం వినుకోండ తూపు పొలిమేరన్నూ లింగన పాలెం తూర్పు పొలిమేరన్నూ హద్దు- 28)