పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

167 కనుమర్లపూడి కైఫీయతు కై ఫీయతు మౌజే కనుమలపూడి పరగణే వినుకొండ వంట్టు పాతికె యిలాఖే వాశిరెడ్డి జగన్నాథబాబు స్న ౧౨౨ (1817 AD) ఫసలీ యీశ్వర నామ సంవత్సర ఫాల్గుణ శులు మజ్కూరి కరణాలు కనుమలక్షాపూడి మల్లమరాజు యీపిచ్చిరాజు వ్రాయించిది. కుమా త్త్ె పూర్వం కంచల్ల=లో కృష్ణ గంధర్వుడనే రాజు వుఁడ్డగా యీ రాజు పల్నాడు శీమలో వుండే శీలం బ్రంహ్మనాయుడు అనే వెల్మవారు అయిన బ్రంహ్మనాయుడు అన్న పెద్దన్న అనే అతను యీ దేశానికి వచ్చి యీ రాజు కొమాతైజును పెండ్లాడి వుండగా మరికొంన్ని దినములకు పెద్దంన్నగారు వెల్మవారు అని రాజ్కు తెల్సి యితణ్ని మనచింన్నది యిక్కడ వుండగా చంపడం యుక్తం కాదని యోచ్న చేశి అప్పట్లో కంచల్లకా చెరువులో మక్కు శనగ పండుతూ వుండగా దేవలోకం నుంచి వక దేవాశ్వం ప్రతిరోజున్నూ వచ్చి యీ చర్వులో వుండే శనగ మేళి పోతుంన్ను వుంన్నంతల్లో వక నాటి సమయమందు యీ చెర్వులో శనగ యక్కడపోయ్యేదింన్ని కనపడక వున్నంద్ను దీని కనిపెట్టవలెనని యోచ్న చేశి చర్వు చుట్టున్నూ యెవరు రాకుండా కావలి వుంచ్చి తాను దండ్డదారుడై కావలి వున్న సమయమందున యీ గుర్రం యెప్పటివలెనే దేవ లోకాన్నించి యీ శనగనిమిత్తం రాగా ఆ సమయమందు రాజు గుర్రాని చూచి మందుగుండు తోటి వెయ్యగా అప్పుడు యీ ఆశ్వం గరిభణీగా వున్నందువల్లనుంన్ను యీ దెబ్బలకు నిర్వహించలేక అంతరిక్షాన యెగిరిపోతున్న సమయమందున అశ్వం గభకాంభిన్నమై పిల్ల కిందపడగానే యీ రాజు చూచిన వాడై దీన్ని పట్టుకోవలెనని అనేక మందితో గుంపు కూడి రాగా యీ పిల్ల వీరిని లక్ష్యపెట్టక అందరినీ తరిమి కొట్టుతూ వుండగా అప్పుడు రాజు యీ ఆశ్వాన్ని సాధించి పట్టుకొని దీన్ని బయట వుంచ్చేది కాదని ముందు మనకు ప్రమాదం వచ్చునని యోచన చేశి భూగృహం యేప్ప౯ుర్చి యీ భూగృహములో వుంచి వున్నారు. గన్కు యీ పెద్దంన్నను ప్రత్యేకముగా చంపడానకు యుక్తముగా దానింన్ని యీ భూగృహములో వుంచ్చి వున్న ఆశ్వం మీద యెక్కించి నట్టు అయితే యీ ఆశ్వమే యితనిని చంపుననిన్నీ యోచ చేశి భూగృహమందు వుంన్న అశ్వాన్ని తీసుకువచ్చి దానికి సకల విదులు శృంగారించ్చి ఆ దేవతా ఆశ్వము మీద యీతణ్ణి యెక్కించేవర్కు యీ ఆశ్వము వాయు వేగ మనోవేగము వల్లను యితణ్ణి పల్నాటికి తీసుకొనిపోగా అప్పుడు యితడు దృఢవిత్తుడయినందు వల్లనుంన్ను సమధక్షాత్వం చేతనున్ను యీ అశ్వాన్ని సంబ్బాలించ్చుకొని తమవారి దగ్గరకు వెళ్ళి యీ వృత్తాంతం అంతా వారితో చెప్పి వారిని అందరిని పిలుచుకొని యుద్ధ సంన్నద్ధుడై యీ స్తళానకు వచ్చి శత్రువుల యొక్క బలాన్ని కలశినంద్ను యీ గ్రామానకు కదమల్లపూడి అనే నామాంక్కితం వచ్చినది. తదనంతరం వాడుక వల్ల కనుమలక్షా పూడి అనే వాడుక ప్రజల వల్ల ఆయ్నిది. కలియుగ ప్రవేశం అయిన తనంతరం యుధీష్ఠర విక్రయ శకంబ్బులు జర్గిన మీదట శాలివాహన శక ప్రవేశం అయి మీదట యీ దేశానికి గణపతి, ఆశ్వపతి,