పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కయిపియ్యతు యీ దేవబ్రాహ్మణ భూమికి తప్పి ఆపహరించ్చినవారు బ్రహ్మక్షత్ర వైశ్య శూద్ర జాతము లలో యవరు తప్పి అపహరించినవారు కాశీలో గంగా గర్భముద్దు కోటికపిలధేనువులను కోటి విప్రులను కోటి శిశువులను వధించిన పాపాన పోదురు. కాశీలో యీ శాసనాలలో యెరింగించుచున్నది గన్కు ధర్మమే ఆర్జించుకొవవలశినది. నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యం ధర్మసంగ్రహం| క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవిత మావయోః | యవస్య కరుణా (నా) స్తి ధర్మసత్వరి తాగతిః| శ్లో॥ నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యం ధర్మ సంగ్రహమ్| క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవిత మావయోః శ్లో॥ యమస్య కరుణా నాస్తి ధర్మస్యత్వరి రితాగతిః || తా॥ మరణము నిత్యమాసన్నమై యున్నది; ధర్మమును ఆచరించి తీరవలయును, మనస్సు గాని ధనము గాని జీవితము గాని యివి క్షణకాలములో మారును, యమధర్మరాజునకు దయలేదు, అందుచే తొందరపడి ధర్మాచరణ మొనరింపవలయును. శ్లో॥ [{ 157 మద్వంశ జాః పరమహీపతి వంశ జాతః । యో భూమిపాః | స్సతత ముజ్జ్వల ధర్మచిత్రాః | యేద్ధర్మ మేవ పరిపాలనమాచరన్త 8 తత్పాదు కద్వయమహం శివసావ హామీ ॥ మద్వంశజాః పరమహీపతి వంశ జాతాః యే భూమి పాః సృతత ముజ్జ్వల ధర్మ చిత్రాః | యేధర్మమేవ పరిపాలన మాచర న్తః తత్పాదుకద్వయ మహం శిరసావ హామి. తా॥ నా వంశీకులు గాని - పర వంశీకులు గాని యే రాజులు ధర్మకర్మ నాచరించు చుందురో అట్టి మహానుభావుల చరణ ద్వంద్వములును నా తలపై ధరించుచున్నాను.