పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

రేటూరి కథ

కయిఫియ్యరు మౌజే రేటూరు పరగణే విని(ను)కొండ్డ సర్కారు మృతు౯

జాంన్నగరు తాలూకే రాజామల్రాజు వెంక్కట గుండ్డారావు సరు దేశముఖు

మన్నె వారు..

ప్రస్తుత నామం గల రేటూరు అనే గ్రామాన్కు యీశాన్య భాగ మంద్దు పూర్వం జయినులు రాజ్యం చేశేటప్పుడు కొండ్రాజుపాడు అనే గ్రామం జయన బస్తిగా వుండు ముక్కంటి రాజ్యకాలమంద్దు కాశీనుంచ్చి వచ్చిన బ్రాంహ్మణులకున్ను జయనులకుంన్ను వివాదములు జరిగి హీనవాదులు అయిపోయిరి. గన్కు ఆ కాలమంద్దే యీ కొండ్రాజుపాడు అనే జయన బస్తిపాడు అయిపోయ్నిది.

తదనంత్తరం యీ రేటూరు అనేది. అప్పుడు రేగుచెట్ల తోటి కూడ గూడుకుని మెక్కభూమిగా వుండ్డి జలవసతింన్ని కలిగి వుండ్డె గన్కు ఆ ప్రదేశమంద్దు గ్రామం కట్టి రేటూరు అనే నామం యేప౯రచినారు.

గణపతి శింహ్వాసనస్తుడయ్ని గణపతి మహారాజులుంగారు రాజ్యం చేశేటప్పుడు వీరి దగ్గిర మహాప్రధానులయ్ని గోపరాజు రామన్నగారు సమస్తమయ్ని నియ్యోగుల్కు గ్రామ కరిణీకపు మిరాశీలు నిన౯యించే యడల యీ గ్రామాన్కు వెలనాడు శ్రీవత్స గోత్బలయ్ని బ్రహ్మండ్డం నాగరాజుకు ఏకభోగంగ్గా గ్రామ కరిణీకపు మిరాశి నిన౯యించ్చినారు గన్కు ఆ నాగరాజు గ్రామ కరిణీకం చేస్తూ వుండ్డి. యీ గ్రామాన్కి పశ్చిమ పాశ్వ౯ మంద్దు విష్ణుస్తలం కట్టించ్చి గోపాల స్వామి వారిని ప్రతిష్ఠ చేయవలెనని విగ్రహాంన్ని సంప్పాదన చేశి ప్రతిష్ఠ చేయవలెనని యత్నికృతం చేస్తూ వుండగా క్షామ దశ చాతను అవాంత్తరం సంధి వచ్చె గన్కు ఆ విగ్రహాంన్ని జలస్తాపన చేశి మరికొన్ని దినములకు అతను స్వగ౯స్తు డయినాడు గన్కు అతని కొమారుడయ్ని లక్ష్మీపతి ప్రజలుడై తన తండ్రి చేశిన ధర్మకార్యం నెరవేరకపోయెనని విచారిస్తూ వున్నంతలో స్వప్న లబ్దమంద్దు లక్ష్మీ నృశింహ్వస్వామి వారు. మీ ఆవరణం చొప్పదొడ్లోచొప్ప వామిలో స్వయం వ్యక్తంగ్గాను స్వల్ప విగ్రహముగా అవతరించి వున్నాను. నన్ను తీసుకు వెళ్ళి మీ తండ్రి కట్టించిన దేవాలయములో ప్రతిష్ఠ చేయ్యమని అనతిచ్చినారు గన్కు అదే ప్రకారంగా లక్ష్మీనృశింహస్వామి వారిని ప్రతిష్ఠ చేశి యీ స్వామి వారిని పూజించ్చడాన్కు నారాయణం రంగ్గాచార్యులు అనే విఘానుసుణ్ని (విఘనసుని) నిన౯ యించ్చి యీ స్వామి వారికి నిత్య నైవేద్య దీపారాధనలకు మహోత్సవములకు జరుగుగ లంద్లుకు కు ౧౹ కుచ్చపాతిక భూమి యినాము యిప్పించి అఖండమున్ను సాలియానా వచ్చే పండుగలు మహోత్సవములకు గ్రామఖచు౯లలో యిచ్చేటట్టు నిన౯యించినారు. ఇతని కౌమారుడు