పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

47

పొన్నూరు

కయిఫియ్యత్తు మౌజే దండ్డమూడి సంతు పొన్నూరు సర్కారు ముత్తు౯ జాంన్న

గరు మౌజే తాలూకే చిల్కలూరిపాడు.

యీ గ్రామాన్కు పూర్వం నుంచి దండ్డమూడి అనే పేరు వుంన్నది.

గజవతి సింహ్వాసనస్తుడైన లాంగూల గజపతి మహరాజులుంగారు పరాక్రమవంతులై రెడ్డి కనా౯ట్కరాజులను జయించి ప్రభుత్వము చేసేటప్పుడు యజుశ్శ్యాఖాధ్యయ నులుంన్ను కాశ్యపస గోత్రోద్భవులుంన్ను అయ్ని మండవ శ్రీరామ మునులు గారు బహుశాస్త్ర వేత్త లుంన్ను తపస్సంపన్నులుంన్ను అయివుందురు గన్కు వారివల్ల నుంచింన్ని సమస్త ధర్మశాస్త్రములుంన్ను తెలియడాన్కు పౌరాణికత్వముంన్ను నిర్ణయించి వారివల్ల నుంచిన్ని శ్రుతి శ్మృతి పురాణేతిహాస తత్వాథ౯ములు వినిసంతోషించ్చినవారై పౌరాణీకుల్కు పుత్రపౌత్ర పారంపర్యం జర్గడాన్కు శాశ్వత జీవనములు చాయవలెనన్న తాత్పర్యం చేతను శ్రీరామమునులు గారిని సన్మానించ్చి, స్వస్తిశ్రీ శాలివాహన శక వరుషంబు లు ౧౩౪౧ (1419 AD) మందు దండమూడి అనే గ్రామం అగ్రహరం చేశి అష్టభోగసహితంగ్గాను ధారాగ్రహీతం చేసినారుగన్కు శ్రీరామమునులుగారు ఆగ్నిహోత్రములతోటి యీ దండమూడి అగ్రహరం లోకి వచ్చి ప్రవేశించి గృహనిర్మాణముచేసికొని శిష్యుల్కు వేదశాస్త్రములు చెప్పుతూ నిరతాంన్నదానపరులై యీ శ్రీరామమునులు గారుంన్ను వీరి కొమారులయ్ని రామానుజాబార్యులు వీరి పుత్రులు వెంక్కటాచార్యులు కనా౯ట్క ప్రభువులైన రామరాయలు వారి అధికారం వర్కు జర్గిన తర్వాతను శ్రీరంగ్గరాయలు వారు ప్రభుత్వములో శీతాపతి అయ్యవారు గారు బ్రంహ్మ విద్వాంసులు అయి వుందురు గన్కు వీరిని చాలా సన్మానించి యీ ఆగ్రహారం జర్గించ్చినాడు గన్కు ఆయన యీ గ్రామమందు దేవస్తానములు కట్టించ్చి, శ్రీ కేశవస్వామి, భీమేశ్వరస్వామి వాల్ల౯ను ప్రతిష్ఠ చేశి నిత్యనయవేద్యముల్కు కేశవస్వామి వారికి కు ౧ భీమేశ్వర స్వామి వార్కి కు ౦౺౦ వెరశి కు ౧౺౦ భూమి యినాం యిప్పించ్చినారు.

తదనంత్తరం మ్లేచ్చాక్రాంతమయ్నింద్ను అగ్రహారపు సంజ్ఞ తప్పించ్చి మ్లేచ్ఛ ప్రభువులు కరిణీకపు హోదాలో వుండ్డేలాగ్ను పైన వ్రాశ్ని శీతాపతి ఆయ్యవారు కొమారుడు రామకృష్ణయ్యను నిణ౯యించ్చి కొండ్డవీటి శీమ సముతు బంద్దీలు చేశేటప్పుడు యీ గ్రామం పొన్నూరు సముతులో చేర్చి మాణిక్యరావు గార్ని దేశముఖి మంన్నెవారు గానుంన్ను, మానూరివార్ని మజ్ముందాల్లు౯గానుంన్ను పాత్రుని వారిని దేశపాండ్యాలుగానుంన్ను నిణ౯యించ్చి ఆలపత్తి౯ వార్ని సముత్కు మాత్రం చౌదలు౯గానుంన్ను యేప౯రచినారు గన్కు సముతు అమీలు గూడా పయిని ప్రశ్ని దేశస్థుల పరంగ్గా తమ గ్రామం యొక్క కమామీషు