పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

గ్రామ కైఫియత్తులు


యడల యీ గ్రామాన్కు గంగ్గరాజు వారు కొంమ్మరాజు వారు నాగరాజు వారు సోమన వారు వెరశి నాల్గు సంప్రతులు వార్కి మిరాశి నిన్న౯యించ్చిరి. యీ మజ్కూరు పొలములో కురు భూమి యినాం యిప్పించినారు. గణపతి మహారాజులుంగారున్ను వీరి కొమారులైన కాకతీయ్య గణపతి తత్పుత్రుడైన కాకతీయ్య రుద్ర దేవ మహారాజులుం గారున్ను అధికారములు చేశ్ని మీదు రెడ్లు బలవంత్తులై యీ దేశములు యేల్ని తదనంత్తరం తిర్గి గజపతి వారు శాలివాహన ౧౮౩౬ శకం వర్కు (1514 AD) ప్రభుత్వము చేశిరి.

శాలివాహనం ౧౪౩२ శకం (1515 AD) కన్నా౯ట్క రాజయ్ని కృష్ణరాయులు గజపతి వార్ని జయించ్చి కొండ్డవీటి దుగ్గ౯ం పుచ్చుకొని ప్రభుత్వం చేశే యడల వీరి ప్రధానలయ్ని హరి బలపు తింమ్మరసయ్య గారి కొమారులయ్ని లక్ష్మీకాంతర్సులు గారుప్రచ్ఛన్న కేశవ స్వామి వార్కి ఆలయం కట్టించ్చి శ్రీ స్వామి వార్ని ప్రతిష్ఠ చేసి యీ స్వామి వార్కి సకలోత్సవములు జరిగించ్చినారు.

తదనంతరం అచ్యుతరాయుల వారి అధికారం జర్గిన తర్వాతను శ్రీ మన్మ మహారాజాధి రాజ పరమేశ్వర శ్రీ వీర ప్రతాప సదాశివ దేవ మహారాయలుంగ్గారు రత్న శింహ్వాసనా రూఢులై పృథ్వీసాంబ్రాజ్యము చేయుచుండి శ్రీ మన్మహా మండ్డలేశ్వర రామ రాజయ్య దేవ మహారాజులుంగార్కి యీ దేశాన్కు మానవయం త్తరానకు పాలించ్చ నవధరించ్చిరిగన్కువారు ప్రభుత్వము చేస్తూ కొంమ్మూరు పరగణే రావిపాడు గోకులమూడి గ్రామాల కరణాలు బ్రాహ్మలు స్థానం వారు వూడిగె సాని బోగాల వార్కిన్ని యిచ్చ్ని ధర్మ శాసన క్రమ మెట్లంన్నను శ్రీ మన్మహా రాజాధిరాజ పరమేశ్వర శ్రీ వీర ప్రతాప సదాశివ దేవ మహా రాయులుంగారు శింహ్వాసనస్తులై సాంబ్రాజ్యం శేయుచు మాకు పాలించ్చినవధరించ్చిన పర్వతాల మల్లిఖాజు౯న లింగ్గానకు జేరి వచ్చి కొంమ్మూరు గ్రామాలను శ్రీ అగస్తేశ్వర శ్రీ మన్మమహా దేవుని ఆంగ్ల రంగ వైభవాల్కుంన్ను సాగివచ్చి గ్రామాల వారు వూడిగె సాని బోగుల వారు కరణాలు బ్రాహ్మలు చేశ్ని వ్యవసాయాలకు పూర్వ మర్యాదను కోరువెట్టి వారు. యీ చేశ్ని వ్యవసాయాల్కు పంన్ను కట్నం కానికె విరాశలు మొదలయ్ని రొఖ్యం కాసు సర్వ మాన్యము యిస్తిమి. కొంతమంద్ధి అన్య గ్రామాలకు వెళ్ళిపోయ్ని వార్ని గ్రామాల్కు రప్పించి వ్యవసాయం చేయించ్చిరి. మీ పుత్ర పౌత్ర పారం పర్యంగ్గాను ఆ చంద్రాక్క౯ స్థాయి గాను శ్రీ అగస్తేశ్వర శ్రీ మన్మహాదేవుని ముఖమఁట్టపాన ఉద్ధాన ద్వాదశి పుణ్యకాలాన శిలా ధర్మశాసనం వేయి స్తిమి. యీ ధర్మ శాసనం యెవరు గన్కు తప్పి రొఖ్యం కాసు వీసాలు కొంన్నాను. గంగ్గ దగ్గిర గోవు బ్రాహ్మణునిన్ని తమ తల్లి తంత్య్రాదులు గో హత్య బ్రాంహ్మత్య దేవ హత్య పాత కాల బోవువారు.

శ్లొ॥ సందత్తాం ద్విగుణం పుణ్యం | పరదత్తాను పాలనం |
పరదత్తా పహరేణ స్వదత్తాని ష్పణం భవేత్ ॥