పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

25

కొమ్మూరు

కయిఫియ్యతు మౌజే కొమ్మూరు సంతు చర్కూరు సర్కారు ముత్తు జాంన్నగరు

తాలూకే సత్తెనపల్లి ·

పూర్వం యీ స్థలం బహు అరంణ్యంగా వుండ్డు గన్కు తప ప్రభావ సంపన్నులయ్ని ఘ వంట్టి అగస్త్యులు యిక్కడ వుండ్డబడ్డము వండ్డి వూగేర్కు ఓంక్కారనది అనే పేరు బెట్టి ఆ నదీ తీరమంద్దుఆశ్రమం చేస్కుని కొంన్ని దినములు తపస్సు చేశి శివలింగ్గ ప్రతిష్ఠ చేశినారు, గన్కు యీ స్వామి వారు అగస్తేశ్వరులు అనే నామం చాతను బహు దినములు రుషుల చేతను పూజింపబడ్డారు. ఆ దినములలో యీ స్తలం శివపురం అనే అభిదానం వహించ్చేను. శృంగేరితో సమానమయ్ని స్తలమని శృంగ్గిపురి అనీంన్నీ అనిరి. ప్రాకృత భాషేణా కొంమ్మూరు అని అంటున్నారు.

తదనంత్తరం వర విక్రమ కాలం ౪౩ అగు నేటి విళంబ్బి నామ సంవ్వత్సర మంద్దు శ్రీ మచ్చాళుక్య వంశీకుడయ్ని శ్రీ త్రిభువన మల్లదేవ మహాకాయిలుం గారు మహా సామంత్త సేనా సమేతంగ్గా బయల్ దేరి దుష్ట నిగ్రహ శిష్ట పాలన చేస్తూ యీ స్థలాన్కు వచ్చి యీ స్థల పూర్వోత్తం విచారించ్చి యిక్కడ కొన్ని దినములు నిల్చి శ్రీ అగస్తేశ్వర స్వామి వార్కి ఆలయ ప్రాకార మంటపములు కట్టించ్చి యీ స్వామి వాన్ని౯ పూజించడాన్కు శ్రీశైల పర్వతమంద్ధు జంగ్గాలను నియమించ్చి యీ స్తలము బస్తీ చేశి శ్రీ స్వామి వార్కి నిత్యనయివేద్య దీపారాధనల్కు వుత్సవములు వగయిరా జర్గగలంద్లుకు కొంమ్మూరు పరగణా రావిపాడు గోగులమూరి అనేవి నాల్గు గ్రామములు సర్వాగహారములుగా సమప్పి౯ంచ్చి వీటి వల్ల వచ్చ్ని ఫలసాయం స్వామి వార్కి సకలోత్సవములు జర్గుగా మిగిలిన తశ్శేష పదార్థ ములు శ్రీ పర్వత మల్లిఖాజు౯న దేవున్కి సమప్పి౯ంచ్చే లాగ్ను నిన౯ంయించ్చినారు గన్కు యీ ప్రకారంగ్గా బహు దినములు జర్జెను.

తరువాత కుళోత్తుంగ్గ చోడ మహరాజు ప్రభుత్వాన్కు వచ్చి శ్రీ స్వామివార్కి సక్కలోత్సవములు మామూలు ప్రకారంగా జర్గించ్చి శ్రీ అగస్తేశ్వర స్వామి వార్కి అఖండ్డవత్తి౯ త్రికా దీపంబ్బులకు సమప్పి౯ంచ్చి ధర్మంబ్బులు శాలీవాహనం ౧౦౫౩ శక (1131 AD) మంద్దు శాసన స్తంభంబ్బుల మీద లిఖింప చేశి ప్రభుత్వము చేశాను.

అటు పింమ్మట గజపతి శింహ్వాసనస్తుడయ్ని గణపతి మహారాజులుంగారు ప్రభుత్వాన్కు వచ్చి శాలివాహనం ౧౦౫౩ శకం (1134 AD) లగాయతు రాజ్యం చేస్తూ పూర్వీకమయ్ని దేవ బ్రాంహ్మణ స్వాస్త్యములు జరిగించ్చి రాజ్యం చేస్తూ వుండ్డగా వీరి దగ్గిర మహాప్రధారులయ్ని గోపరాజు రామన్నగారు బ్రాంహ్మణులకు మిరాశీలు నిన్న౯యించ్చే