పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

గ్రామ కైఫియత్తులు


గ్రామాన్కు పశ్చిమ పార్వ౯మంద్ను శివాలయం కట్టించి శ్రీశైలం నుంచి తీసుకువచ్చిన లింగ్డమూర్తిని శ్రీగిరిమల్లికాజు౯న స్వామి వారినే నామాంకితం చేశీ శాలివాహనం ౧౦౭౮ శక (1156 AD) మంద్ను ప్రతిష్ఠ చేశి యీ స్వామి వారిని పూజించడాన్కు వెలనాడు శ్రీ వత్స గోతృలయ్ని శంక్కరమంచ్చి అయ్యం భొట్లును నిన౯యించి యీ స్వామి వార్కి నిత్య నైవేద్య దీపారాధనలు జరుగగలంద్లుకు కుచ్చళ్ళు ౧ కుచ్చల భూమి యినాము యిప్పించి మరిన్ని యీ శివాలయాన్కు యీశాన్య భాగమందు విష్ణు స్తలం కట్టించి శ్రీ చన్న కేశవర స్వామి వారిని ప్రతిష్ఠ చేశి యీ స్వామి వారిని పూజించ్చడానకు నారాయణు నృశింహాచార్యులు అనే విఘాససుణ్ని నిన౯యించి యీ స్వామి వారినిత్య నైవేద్య దీపారాధనలకు జరుగ గలంద్దుకు కు ౧ భూమి యినాము యిప్పించినారు.

వడ్డె రెడ్డి ప్రభుత్వములు శాలివాహనం ౧౩౪౨ రకం (1420 AD) వర్కు జరిగిన తరువాతను తిరిగి గజపతి వారు దేశం ఆక్రమించ్చి ప్రభుత్వం చేస్తూ వుండ్డగా శాలివాహనం శకం ౧౪౧౭ శక (1495 AD) మందు నరపతి శింహ్వానస్తుడయ్ని కృష్ణదేవ మహారాయలు గజపతి వారిని జయించి వీరభద్ర గజపతిని పట్టుకొని దేశం స్వవశీ కృతం చేసుకునెను గన్కు అప్పటిలో యీ వినికొండశీమ రాయని భాస్కరునికి అధికారిగా నిర్ణయించినారు గన్కు శాలివాహన ౧౪౫౫ శకం (1533 AD) వరకు శ్రీ కృష్ణరాయలు వారి ప్రభుత్వం వరకు భాస్కరుని వారి పరంగ్గ్గా అధికారం జరిగేను. తదనంత్తరం అచ్యుతరాయులు సదాశివ రాయలు రామరాయలు శ్రీ రంగరాయలు మొదలయిన కనా౯టక రాజులు శాలివాహనం ౧౫౦౦ శకం (1578 AD) వరకు ప్రభుత్వం చేసిరి. శాలీవాహనం ౧౫౦౨ శకం (1580 AD)లో కన్నా౯టక పాదుశహా అయ్ని శ్రీ రంగరాయలును జయించి మల్కి విభురాం పాదుశహ వారు దేశం ఆక్రమించుకుని దేశ ముఖు దేశపాండ్య మొదలయ్ని బారాముతస్సద్ధి హోదాలు నిన౯యించే యడల యీ పరగణాకు పూర్వీకులయిన భాస్కరుని వారు గుంట్టుపల్లి వారు అనే రెండు సంప్రతులవారికి దేశపాండ్యాగిరీ మొకర్రరు చేసి అమాని మామలీయ్యతు జర్గేటట్టుగా కట్టడిచేసి పయిన వ్రాశ్నీ మల్కి విభురాం పాదుశహ వారున్ను యితని కొమారు డయిన మమ్మదుశా పాదుశహ వారున్ను యితని కొమారుడయిన మమ్మదుశా పాదుశహా గారున్ను ప్రభుత్వం చేస్తూ వుండగా గుంట్టుపల్లి ముత్తరాజు గారు శాలివాహనం ౧౫౩౫ (1613 AD) లగాయతు కొన్ని సంవత్సరములు బహు ప్రకాశితగా ప్రభుత్వం చేసినారు.

తదనంత్తరం మల్రాజు సూరంన్నగారు తమ పౌరుష విశేషం చాతను యీ పరగణే జమీందారి సంప్పాదని చేసుకొని ప్రభుత్వం చేస్తూ స్వస్తిశ్రీ శాలివాహన శక వరిషంబ్బులు ౧౬౨౪ (1702 AD) అగునేటి చిత్రభాను నామ సంవత్సరమాఖ శు ౭ లు శ్రీ మధ్యజనాది షట్కర్మనిరతులయ్ని రావూరి మల్లప్పగారికి మౌజే మజుకూరిలో కేసరీ పాటిని కు ౧ పొలం యినాము యిప్పించినారు. మరింన్ని యీ శకమంద్దే కొండ్డ గుంట్టూరి అక్క జోస్కుల గారికి ౦౺౦ ఆరకుచ్చల పొలం యినాము యిప్పించ్చినారు. సదరహి సూరంన్నగారు రామా రాయనింగారు వెంక్కట నర్సారాయనింగారు పెనగుండ్డారాయునింగారు ప్రభుత్వములు చేశ్ని