పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

7. కట్టెంపూడి కథ

కయిఫియ్యతు మవుంజె కట్టెంపూడి సంతు పొన్నూరు తాలూకె రేపల్లె యిలాకె

రాజా మాణిక్యారావు భావనారాయణరావు సర్కారు ముత్తు౯జాంనగరు.

ఈ గ్రామానికి పూర్వము నుంచి కట్టెంపూడి అనే పేరు వున్నది. గజపతి శింహ్వాసనస్తుడయ్ని గణపతి మహారాజులుంగ్గారు ప్రభుత్వము చేశేటప్పుడు వారి దగ్గర ప్రధానులయ్ని గోపరాజు రామంన్నగారు శాలివాహన శక వరుషంబులు ౧౦౬2 (1145 AD) అగు నేటి రక్తాక్షి నామ సంవత్సరం భాద్రపద బహుళ 30 అంగారకవారం సూర్యొపరాగ కాలమంద్దు తమ ప్రభువు అయ్ని గణపతి వారి చేతను కృష్ణా స్నానకాలమంద్దు దానంపట్టి బ్రాంహ్మణుంకు మిరాశీ స్నదులు వ్రాసి యిచ్చే యడల యీ కట్టెంపూడికి తుము లింగ్గన్న గారికి యేక భోగముగా మిరాశీ వ్రాశి యిచ్చినాడు. గన్కు తద్వంశజులయినవారు తదా రథ్య యీ వరకు గ్రామ కరిణీకపు మిరాశీ రశ్మితేజోపార్జనలు పిడివరు పీడీలుగా (పరంపరగా) అనుభవిస్తూ వుంన్నారు పయిన వ్రాస్ని లింగంన్న గారు మిరాశీ సంప్పాదన చేసుకుని స్తలంలో ప్రవేశించి గ్రామము బస్తిచేశి యీ గ్రామానకు దక్షిణ భాగమంద్దు విష్ణు స్తలము కట్టించ్చి కేశవస్వామి వార్ని ప్రతిష్ఠ చేశి ఈ గ్రామాన్కు వుత్తరం భాగమందు శివాలయం కట్టించి శ్రీ మల్లికార్జునస్వామి వారిని ప్రతిష్ఠ చేశి యీ స్వాముల వార్లకు నిత్యనైవేద్య దీపారాధనలు జరుగగలందులకు అరకుచ్చల మాన్యం యిప్పించ్చి వుత్సవములు జరిగించినారు గన్కు యిదే ప్రకారం వడ్డెరెడ్డి కనా౯టక ప్రభుత్వము ఆఖరు శాలివాహనం ౧౫౦౦ శక (1578 AD) వర్కు అర్చనాదులు జరిగినవి. తదనంత్తరం మొగలాయి ప్రభుత్వం వచ్చిన తర్వాతను క్షామ డాంబ్బర్యముల చాతను స్తలాలు అంతరువు పడ్డవి. తరువాత కొండ్డవీటి శీమ సంతు బంద్దీలు చేశేటప్పుడు యీ గ్రామం పొన్నూరు సముతులో దాఖలు అయ్నిది గన్కు దేశముఖులున్ను మాణిక్యారావు వారు దేశపాండ్యాలయిన పాత్రునివారు సముతు చపుదల్లు౯ అయిన అలపత్తి౯వారు వీరి గుండ్డ సముతు అమీలు పరంగ్గా కరణాలు అమానీ జమా బంద్దీ ఫయిసలు చేసుకుంటు వచ్చినారు. స్న ౧౧౨౨ ఫసలీ (1712 AD)లో కొండ్డవీటి శీమ మూడు వంట్లు చేశి పంచ్చిపెట్టే యడల రమణయ్య మాణిక్యరాయనిం గారి వంట్టులో చేరినది గనుకు ఆయన ప్రభుత్వం చేస్ని తర్వాతను వారి తమ్ములయ్ని మల్లంన్న శీతన్న మాణిక్యరాయనింగ్గాలు౯ స్న౧౧౨ఽ ఫసలీ (1717 AD)లో ప్రభుత్వానికి వచ్చి తూమి అరచ్చన్న గారికి అరకుచ్చల మాన్యము యిప్పించినారు. వారు అన్నదమ్ములు ఆరుగురు ప్రమేణ ప్రభుత్వం చేశ్ని తర్వాతను తదనంత్తరం గోపాల మాణిక్యరాయనింగారు స్న౧౧౬౮ (1758 AD) సంవత్సరము వర్కు ప్రభుత్వము చెశ్ని తర్వాతను స్న ౧౧౬౯