పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వుంన్నవ

87


ఆమడ దూరన వుంన్న పణిదెం దగ్గర నిల్చినది. వక బండ్డి యిక్కడనే ప్రదక్షిణంగ్గా వచ్చి నిల్చినది గన్కు యీ మూడు స్థలములయంద్దు దేవస్థళాలు కట్టించి శ్రీ స్వామి వాల్ల౯ను ప్రతిష్ఠ చెశ్నిది. శ్రీస్వామివాలు౯ భూవివరమంద్దువుండ్డి “వుంన్నా వుంన్నా” అనేటట్టుగా వసియించ్ని ప్రదెశమంద్దు గ్రామం కట్టించినంద్ను యీగ్రామాన్కు 'వుంన్నవ' అనె అభిదానం యెప్ప౯డ్డది.

గజపతి శింహ్వాసనస్తుడైన గణపతి మహారాజులుంగారు శాలివాహనం ౧౦౫౬ (1134 A.D) శకం లగాయతు రాజ్యం చేస్తూవుండ్డిరి గన్కు విరిదగ్గిర మహాప్రధాను లయ్ని గోపరాజు రామన్నగారు శాలివాహనం ౧౦౬౭ (1145 A.D) శకమంద్దు బ్రాంహ్మణుల్కు గ్రామ మిరాశీలు నిన్న౯యించ్చె యడల యీవుంన్నవకు వుంన్నవ వారనె ఆరువెల వార్కి భొగాలు౨యాజ్ఞవల్కులు కలవట వారనె యాజ్ఞవల్కులకు భొగం ౧ యీ ప్రకారంగ్గా నిన్న౯యించ్చి మజ్కూరి పొలంలో మూడు కుచ్చెళ్ల భూమి యినాం యిప్పించ్చి మిరాశి నిన్న౯యించ్చినారు గన్కు అప్పట్లో గ్రామస్తులు యీగ్రామాన్కు పశ్చిమం శివాలయం కట్టించి శ్రీమూలేశ్వరస్వామివారనె లింగ్డమూత్తి౯ని ప్రతిష్ఠ చెశినారు.

వడ్డె రెడ్డి కన్నా౯ట్క ప్రభుత్వములు శా ౧౫౦౦ శకం (1578 A.D) వర్కు జర్గిన తర్వాతను దెశం మ్లెచ్చా కాంత్తమయ్ని తర్వాతను కొండ్డవిటి శిమ సర్కారు సముతు బంద్దీలు చెళెటప్పుడు యీగ్రామం నాదెండ్ల సముతులో దాఖలు చేశి తదనంత్తరం కొండ్డవీటి కిల్లాదారుని పరంగా దుగ్గ౯ం కింద్ద జాగీరు నడిచే గ్రామాలలో దాఖలుచెశినారు గన్కు మల్కి విభురాం మహంమ్మదుళా సుల్తానబ్దుల్లా తానీషా పాదుషాల పరియంత్తం కిల్లాజాగీరు కింద్దనడుస్తూవుండ్డగా అలంగ్గీరుగారి అధికారములో ఖాయతు రామారావు ఆనె అతనుకిల్లేదారివచ్చి జాగీరు గ్రామములు అనుభవిస్తూ యీస్థలాన్కు వచ్చి శ్రీరాజగోపాలస్వామివారి పూర్వొత్రములు విచారించ్చి యీదెముని యంద్దు చాలాభక్తిగల్గి శ్రీరాజగోపాలస్వామివారి ఆలయం మరామతు చెయించ్చి మంట్టపములు కట్టించ్చి ప్రాకారమున్ను కట్టించ్చి స్తలం ప్రాబల్యం చెశినారు.

స్న ౧౧౨౨ ఫసలి (1712 A.D)లొ యీసర్కారు నవాబు మురాజు ఖాను బహదరు సుబావారు జమీదాల్ల౯కు మూడు వంట్లుచేశి పంచ్చిపెట్టె యడల యీ గ్రామం పూర్వ ప్రకారంగ్గానె కిల్లా జాగిరు కింద్దను నడిచెటట్టుగా కట్టడిచెశినారు. సవరహి ఫసలి లగాయతు స్న ౧౧౮౮ ఫసలీ (1778 A.D) వికారి సంవత్సరం వర్కు నవాబు బాదుల్లాఖాను పరియం త్తరం కిల్లా జాగీరుదాల్గు౯ పర౦గ్గా యీగ్రామ మామ్లియ్యతు జర్గినది.

తదనంతరం స్న ౧౧౮౯ ఫసలీ (1779 A.D) లో మీరుతహద్దిఖాను అనే పౌజుదారు వారి హయాములో దుగ్గ౯ం కాలిచెశి జాగీడ మాఫిచేశి గ్రామములు జమిదాల్లు౯ తాలూకాలో దాఖల్ చెశిరిగన్కు యీ గ్రామం రాజామానూరి వెంక్కటెశం రావుగారి సత్తెనపల్లి తాలూకాలో దాఖలు అయినంద్ను వెంక్క టేశంగారు సదరహీ ఫసలిలగాయతు స్న ౧౨౦౪ ఫసలి (1894 A.D.) వర్కు ౧౫ సంవత్సరములు ప్రభుత్వం చెశెను.

తదనంత్తరం విరి కొమారులైన వెంక్కట రమణయ్యరావుగారు స్న ౧౨౦౫ ఫసలి (1795 A.D.) లో ప్రభుత్వాన్కు వచ్చి స్న ౧౨౨౧ ఫసలి (1811 A.D.) వర్కు అధికారం చెస్తూవుంన్నారు.