పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

వుంన్నవ

కయిఫియ్యతు మౌజే వుంన్నవ సంతు నాదెండ్ల సర్కారు

ముత్తు౯జాంన్నగరు తాలూకే సత్తెనపల్లి

పూర్వం ప్రస్తుతనామంగ్గల వుంన్నవ అనే గ్రామం యెప౯డక ముంద్దు యీ గ్రామాన్కు దక్షిణపాశ్వ౯ం పుచ్చకాయలపాడు అనే గ్రామం వుడ్డెంది. శాలివాహన శక ప్రవేశమయ్ని తర్వాతను కొంన్ని సంవత్సరములు జర్గిన మీదట శాతరాజులు ప్రభుత్వంచేశె కాలమంద్దు జున్యావుల పెద్దక్క గోపశ్రీ(?) విస్తరించ్ని పశువుల మంద్దల తొటి నల్లకొండ్డశీమ నుంచ్చి పశువుల మేపించ్చె నిమిత్తం యీ ప్రదేశమునకు వచ్చి ప్రస్తుతమందువుంన్న గ్రామం పట్టున భూమి మెర్కగా వుండ్డుటవల్లను వనరు విచారించ్చి దొడ్డిగాకర వెయించ్చి రాత్రి యంద్దు పశువులను మంద్దచేచి౯ యిక్కడ నివాసంగ్గా వుంట్టూ వుండ్డెయడల యీ ఆవుల మంద్దలొ వుండ్డె శ్రేష్ఠమయ్ని మూడు ఆవులపాలు పుదయమయ్యె వర్కు హరింప్పబడి వట్టి పొదుగుల తోటి వుంట్టూవుండ్డ ముంన్ను రాత్రి పశువులదగ్గిర కావలిపడ్కుంన్న గొపకుల్కు తెల్లవారె పరియంత్త రం ఎకరీతిగా "వుంన్నా వుంన్నా" అనే ధ్వని వినబడడమున్ను ఆయగన్కు ఆ గొపకులు తమఖామంద్దురాలయ్ని పెద్దక్కతోటి యావత్ స్తితి చెప్పినంత్త ల్లొ యుక్తి వంత్తురాలు అయినంద్ను పశువులదొడ్డి తిరుగా మరివక ప్రదేశమంద్దు వెయించ్చి సదరహి వ్రాశ్ని ప్రకారం వినుపించ్చినంద్ను తిర్గి పూర్వప్రకారమె మొదట మంద్దచెచి౯న స్థలమంద్దు ధేనువులను మంద్దచెచి౯ నత్తంల్లొ యధాప్రకారం పయ్ని వశ్ని మూడుగోవుల్కు పొదుగులలో పాలు లెక పోవడం “వుంన్నా వుంన్నా” అనెధ్వని విశేషంగ్గా వినబడడముంన్నూ దృష్టమాయగన్కు యిది యోమోవింత్తగా వుంన్నది అని యోజన చేస్తూ ఆరాత్రి జన్యావుల పెద్దక్క తన యిష్టదైవమును మనస్సున తలచుకొని నిద్రించగా శ్రీరాజగోపాల స్వామివారు ఆ రాత్రి పెద్దక్క స్వప్నమంద్దు పొడ చూపి మేము స్వయం వ్యక్తముగా ముగ్గురు రాజగొపాల మూత్తు౯లము రుక్మిణి సత్యభామ సమేతముగా వుద్దరించ్చి వుంన్నాము. మంమ్మును తియించ్చి మూడు బండ్లయంద్దు వుంచ్చి అర్కకట్టిని మువ్వకొడేలను ఆ బండ్లకుకట్టి విడిచి పెడితె ఆ బండ్లు వెళ్ళి యక్కడ నిలిస్తె అక్కడ ఆలయం కట్టించ్చి ప్రతిష్ట చాయమని ఆనతిచ్చి తమఆవులుంన్న స్తలంనిద్దె౯శముంన్ను అగపరచిరి గనుక అదెప్రకారం మరునాడు ఆస్థలము విమశి౯ంచ్చగా వకభావియంద్దు మూడు రాతి తొట్ల యందు మూగ్గురు రాజగోపాల మూత్తు౯లు రుక్మిణి సత్యభామ విగ్రహములతొటి వుండ్డిరి గన్కు బయట్కి వెంచ్చావు చేయించ్చి స్వామివారు స్వప్నములో చప్పిన ప్రకారం మూడు బండ్లు తెప్పించ్చి స్వామివాల్ల౯ను వుంచ్చి బండ్లకు మువ్వ కొడెలను కట్టించి విడిచిపెడితే వకబండ్డి యిక్కడ్కి నాల్గు ఆమడ దూరాన వాయువ్య మూలగా వుంన్న బెల్లంకొంద్ద శిమలో చెర్న కోసూరు దగ్గర నిల్చినది. వక బండ్డి యిక్కడ్కి వుత్తరం మూడున్నర