పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

81

వట్టెచెర్కూరు

కైఫియ్యతు మౌజే వట్టె చెర్కూరు సంత్తు గుంటూరు తాలూకె

రెపల్లె యిలాకె రాజామాణిక్యారావు రాజాభావనారాయణరావు

సందేశముఖి మంన్నె వారు స్న ౧౨౨౮ ఫసలీ (1818 AD)

మజుకూరి కరణాలు కాట్రపాటి వెంక్కట్రాముడు యీ రత్నం

బాపిరాజు వ్రాయించ్చి యిచ్చిన హకీకత్తు (జన౯న (?) ) వారి

కచ్చేరికి వ్రాయించ్చి యిచ్చ్నిది-

పూర్వం యీస్థళమంద్దు వెర్రిచెర్కు అనగా వట్టిచెర్కు కలిగివుండ్డెది గన్కు తంన్నామథేయంవల్ల యీ గ్రామం యెప౯డి వట్టిచెర్కురు అనే వాడికె అయినది. ... శాలివాహన ప్రవేశమైన మీదట యీ దేశమునకు కుళోత్తుంగ్గచోళ మహారాజు పరిశీలనిం చెశ్ని మీదట గజపతి శింహ్వాసనస్తుడైన గణపతి దేవమహారాజులుంగ్గారు ౧౦౫౬ (1134 AD) శకమంద్దు పట్టాభిషిక్తుడై రాజ్యం యెలూతూ వుంన్న సమయంలో వీరివద్దపుండై మహా ప్రధానులై న గోపరాజు రామంన్న శాలివాహనం ౧౦౬౭ (1145 AD) అగు నెటి రక్తాక్షి నామసంవ్వత్సర భాద్రపద బ ౩౦ లు సూర్యోపరాగకాలమంద్దున నదితిరమంద్దున ప్రభువు దగ్గెర దానంపట్టి సమస్తమయ్ని నిమ్యోగులకు గ్రామకరణీకపు మిరాశిలు నిన౯యించే యడల యీగ్రామానికి కాట్రపాటివారి సంప్రతి వకటి చల్లాపల్లివారి సంప్రతి వకటి యీరెండ్డు సంప్రతులు ఆరువేల నియ్యోగులు యెకభోగ్గంగా మిరాశి నిన౯యించ్చి యిచ్చినారు గన్కు తదాది మొదలుకొని తత్పూర్వం నుంచ్చి వారి మిరాశీ అనుభవిస్తూ వుంన్నారు. యీ ప్రకారంగ్గా గణపతి మహారాజులుంగారు మిరాశి వుద్దరించ్చి రాజ్యం యెల్ని మీదట కాకతియ్య గణపతిగారుంన్ను తనపుత్రులైన కాకతియ్య ప్రతాపరుద్రదేవ మహారాజులు రాజ్యం యెలుతూ వుండ్డగా యీ గ్రామస్థులు గ్రామం మధ్య మంద్దున బ్రంహ్మేశ్వర స్వామివారనే లింగమూత్తి ౯ని గోపాలస్వామివారు అనే విష్ణుమూత్తి ౯ని ప్రతిష్టచెశి గభ౯గృహ అంత్తరాశి మంట్టపములు కట్టించ్చి నిత్యనైవెద్యపడతరానికి రెండు కుచ్చళుంన్ను పండ్డుగ పర్వాలకు ౨(?) కుచ్చలనున్ను యిప్పించ్చినారు. శా ౧౨౪౦ శకం (1318 AD) వరకు రుద్రదేవ మహారాజులు ప్రభుత్వం జపి౯నమీదట రెడ్లున్నూ గజపతివారుంన్ను శా ౧౪౩౬ శకం (1514 AD) వర్కు ప్రభుత్వం జర్గినమీదట కృష్ణదేవ మహారాయులు గజపతివారిని జయించ్చి దెశం యెలుతూ సదరహి దెముళ్ళకు మామూలు ప్రకారంగ్గా స్వాస్త్యములు జరిగిస్తూ వచ్చినారు. సదాశివదేవు మొగలాయి ప్రభుత్వంలో కొండ్డవిటి కిల్లాకు హజారి నాయకరంకోట ఖిల్లేవారి హోదాలో వుండ్డి దాన క్షెత్రముల యంద్దు ప్రవీణులయిన చంద్రవంక్క భావన్నా మాణిక్య రాయినింగ్గారికి మృత్యుజాంన్నగరు సర్కారు దేశముఖి మంన్నెవారు హోదానిన్నన్ యించ్చి కొండ్డవీటి శిమ సంత్తు బంద్దిలు చెళెటప్పుడు యీ గ్రామం గుంట్టూరు సముతులో దాఖలు చెశి