పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38


పెదపణిదం

కయిఫియ్యతు మౌజే పెదపణిదం సముతు మునుగోడు సర్కారు

మృత్యు౯జాంన్నగరు తాలూకె చింత్తపల్లి స్న౧౨౨౨

(1812 A.D.) ఫసలి.

యీ గ్రామాన్కు పూర్వంనుంచ్చి పెదపణిదం అనె పెరువుంన్నది. గజపతి శింహ్వాససస్థుడయిన గణపతిదెప మహారాజులు ప్రభుత్వము చెశెటప్పుడు విరిదగ్గర మహా ప్రధానులయిన గోపరాజు రామంన్నగారు శా ౧౦౬౭ (1145 A.D ) శకమంద్దు ప్రభువు దగ్గిర దానంపట్టి సమస్తమయిన నియ్యోగులకు గ్రామకరిణీకపు మిరాశీలు నిన౯యించ్చే యడల యీ గ్రామాన్కు వెలనాడు కాశ్యప గోత్రులయిన యద్దనపూడివారి సంప్రతిం కాశ్యప గోత్రులయిన మత్కుమల్లివారి సంప్రతి ౧ యాజ్ఞవల్క్యులు కొండ్డవారి సంప్రతి ౧ వెరశి మూడు సంపత్రులవారికి మిరాశీ యిచ్చినారు. తదనంత్తరం రెడ్లు. ప్రభుత్వానకు వచ్చి రాజ్యం చెశెటప్పుడు అనవెమారెడ్డింగ్గారు గ్రామానకు తూర్పు పాళ్వన్ మంద్దు శివాలయం కట్టించ్చి శ్రీ సోమేశ్వరస్వామివారనె లింగమూతి౯ని ప్రతిష్ఠచేశీ గ్రామమధ్యమంద్దు విష్ణుస్థలం కట్టించ్చి శ్త్రీ కళ్యాణ గోపాలస్వామివారిని ప్రతిష్టచెశి స్వామివాల౯కు నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ ఆయనోత్సవ సంవ్వత్సరోత్సవములు జరగ్గడానకుంన్నూ నిత్యనయివెద్య దీపారాధనలు జరుగగలంద్దులకు గ్రామాన్కు ఆజ్ఞయభాగమందు కు ౧౨ ఖండ్రికె యినాం యిప్పించ్చినారు. గన్కు వడ్డెరెడ్డి కన్నా౯ట్క రాజులు ధర్మస్థులయి నంద్ను శా ౧౫౦౦ శకం (1578 A. D.) వర్కు ప్రభుత్వం చే సదరహిస్వామి వాల్ల౯కు భోగరాగాలు జరిగించ్చినారు.

శా ౧౫౦౨ శకం (1580 A. D.) లగాయతు యీ దెశాన్కు మొగలాయి ప్రభుత్వము వచ్చె గన్కు మల్కి విభురాహీము పాదుశాహగారి తరబున అమీనను వారు యీ సరకార్కు ఆమీలై వచ్చి శ్రీ స్వామవాల౯కు పూర్వపు రాజులు నిన౯ యించ్చిన ఖండ్రికే కాష్ఠకింద్దను దాఖలుచెస్కుంన్నారు. తదనంతరం పాదుశాహిలు కొండ్డ విటిశిమ సముతు బంద్ధిలు చెశెటప్పుడు యీ గ్రామము మునుగోడు సముతులొ దాఖలు చేసినారు గన్కు చౌదరు దెశపాండ్యాల పరంగ్గా అమీళ్లు అమాని మామ్లియ్యతు జర్గించ్చే యడల మజకూరిలో వున్న స్వామివాల౯కు నిత్యనయి వెద్య దీపారాధనల్కు కు ౪ భూమి యినాం యిప్పించ్చినారు శా ౧౬o2 (1685 A.D.) శకం లో వచ్చిన క్షయ సంవత్సరము సంద్దు సంభవించ్చిన మహాక్షామమంద్దు గ్రామాదులలో ప్రజలు బేజారు అయి గ్రామాదుల నుంచ్చి లేచి ఆంన్యదేశములకు వెళ్లడమాయగన్కు అప్పట్లో మజుకూరిలోవుంన్న సోమేశ్వరస్వామి కళ్యాణ గోపాలస్వామివారి ఆలయములు అచ౯నాదులు జరుగక ఖిలపడిపోయినవి స్న ౧౧౨౨ ఫసలి (1712 A.D.) లో కొండ్డవీటి సీమ మూడు వంట్లుచేశి జమీదాల౯కు పంచ్చిపెట్టె యడల యీ గ్రామం వాశిరెడ్డి పద్మనాభునింగ్గారి వంత్తువచ్చి చింత్తపల్లి తాలూ