పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

83

గొరిజవోలు

కయిఫియ్యతు మౌజే గోరిజవోలు సముతు నాదేండ్ల

తాలూకే సత్తెనపల్లి సర్కారు మృతు౯జాంన్నగరు రాజా

మానూరి వెంక్కట రమణయ్యరావు మజుందారు జమీందారు

స్న౦౨౨౨ ఫసలీ (1812 A.D).

ఈ గ్రామాన్కు. పూర్వంనుంచి గొరిజవోలు అనే వాడికెవుంన్నది. గజపతి శింహ్వాసనస్తు డయ్ని గణపతి మహారాజులుంగారు శాలీవాహనం ౧౦౫౬ శకం (1134 A.D) లగాయతు ప్రభుత్వం చేశేటప్పుడు వీరిదగ్గిర మహాప్రధానులయ్ని గోపరాజురామంన్న గారు శా ౧౦౬౩ శక (1145 A.D) మంద్దు ప్రభువుదగ్గర దానంపట్టి సమస్తమయిన నియ్యోగులకు గ్రామ కరిణీకపు మిరాశీలు నిన౯యించ్చేయడల యీగ్రామాస్కు శుక్లయజుశాఖాధ్యయనులుంన్నూ భారద్వాజస గోత్రులు సంప్రతులు ౨కి సావడివారి సంప్రతి గుల౯వారి సంప్రతి ౧ యీ రెండు సంప్రతులవారికరిణీకం నిన౯యించినారు గన్కు తదాది మొదలుకొని యేతద్వంశజు లయినవారు అనుభవిస్తూ వుంన్నారు.

వడ్డే రెడ్డి రాజులు ప్రభుత్వములు శాలీవాహానం ౧౦౪౬ శకం (1124 AD) వరకు జరిగిన తరువాతను శా౧౪౩౭ శకం (1515 A.D) లగాయతు నరపతి శింహ్వాసనస్తుడయిన శ్రీకృష్ణ దేవమహారాయులు అచ్యుతరాయులు ప్రభుత్వములు చేశిన తర్వాతను సదాశివ దేవరాయులు ప్రభుత్వం చేసేటప్పుడు యీ గ్రామం తాళ్లపాక తిరువెంగళనాధయ్యంగారికి శాలివాహనం ౧౪౭౮ (1558 A.D) అగునేటి విభవ సంవత్సర శ్రావణ బ ౧౨ గురువారంనాడు అగ్రహారంచేశి ధారాగ్రహితంచేశినారు. తదనంతరం రామరాయలు, తిరుమలరాయులు అధికారం జరిగిన పింమ్మట శ్రీరంగ్గ దేవమహారాయులు ప్రభుత్వం చేస్తూ యీగ్రామానకు శ్రీరంగపురమనే అభిధానంచేశినారు (మార్క) కొండపుత్రు లయిన జాతకంన౯ విరుపాక్షుణిరె అగ్రహారం యిచ్చినారు.

యిందుకు శాసనములు (గలవు)

స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలీవాహనశక పరుషంబులు ౧౪౪౯ అగునేటి యీశ్వర సంవ్వత్సర కార్తీక శుద్ధ శ్రీమద్రాజాధిరాజపరమేశ్వర శ్రీ వీర ప్రతాప శ్రీ వీర శ్రీ రంగ్గనాటిదేవ మహారాయలు అయ్యవారు రత్న శింహ్వాసనారూఢులయ్యి పృధివీసామ్రాజ్యము చేయుచున్న మార్క కొండ్డ పుత్రుడయిన జాతకంన౯ విరూపాక్షున్కి యిచ్చిన ధర్మశాసనం....

కొండవీటి రాజ్యములోని గొరిజవోలు గ్రామం ప్రతినామధేయమయిన శ్రీరంగరాయ పురయు సర్వమాన్యపు అగ్రహారముగాను పాలించి యిస్తామని ధర్మం యిస్తిమిగన్కు యీ గ్రామాన్కు ఆష్టదిక్కులుంన్ను శిలా స్తంభాలు తూపు౯న సంకురాత్రిపాడు ఆగ్నేయానకు సొలసదక్షిణం నైరుతిభాగానకు జంగాలపల్లె పడమటను నందవరం———పొణుకుబాడు