పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

గ్రామకై ఫియత్తులు


పుత్తరం నారాకోడూరు కంనాళ్ళ ఆయ్యవార్లగారికి యిచ్చెను. వీరు వాధూల గోత్రులు మదతుబాటి పొలంలో యిచ్చెను. వేమవరపు పొలంలోను తూపలు ౨౫ గొంగలాగడ పొలంలోను తూపలు ౨౫ యీ మూడు వూళ్ల పొలం తూపలు ౭౫ తూపలు సాలుకు హద్దులు నిల్పి ఖండికె అనేనామంచేశి ముడుంబ్బు అయ్యవార్ల గారికి యిచ్చెను. దక్షిణతాళ్ళూరి పొలంలోను తూపలు ౫౦ ఖండికే చేశి శ్రీరంగపురం అని నామంచేశీ అయిదు యిండ్ల వైష్ణవుల్కు యిచ్చెను. యడ్లపాటి పొలంలోను తూపలు ౩౦ ఖండిక చేశి విశ్వనాథుడు అనే బ్రాహ్మణుడికి యిచ్చెను. విశ్వనాధుని ఖండికె అనిరి. యీమనిలోను రాముపాలెంలో తూపలు ౭౫ శ్రీరఘనాయకులు స్వామికి నైవేద్య దీపారాధనలకు యిచ్చెను. యిది సదాశివరాయని వేల్పూరి భోగంది తక్కిన మార్ల పొలంలోను యీసదాశివరాయలు జంపనివారు అనేరాచవార్కి కొల్పుబడి యిచ్చెను. ఆ జంపనివారు ముంన్కు బోగందానికి యిచ్చినారు. ఆగ్రామాదులు తమకు క్కూడ దనిరి. గనుకను యీకొండవీటి శీమ గ్రామాదులలోను కోసూరు ౧ చామర్రు ౧ చింత్తపల్లి ౧ కుంటమద్ది ౧ జటపల్లి ౧ మాదిపాడు ౧ తాడువాయి ౧ చల్లగరికె ౧ యిది తొమ్మిది గ్రామాదులు జంపనివారికి యిచ్బె గనుకను ఆగ్రామాదులు జంపనివారి కిందను ఆలాయిదా అయిపాయను. యీసదాశివరాయలు చనిన వెనుకను జూపల్లి రంగపతి రావు యేలెను. యీ రంగపతిరావు వల్లభాంబాపురం కృష్ణకుస్నానం నిమిత్తం వచ్చిగనుకను బ్రాహ్మణులు జొన్న బియ్యంతోను ఆశీర్వదించిరి. యిది యేమిటి అని అడిగెను. ఆ బ్రాహ్మణులు తమకు యీ గ్రామంలోను వర్తిపొలంలేదు అనిరి. ఆ వల్లభయపురంపు పొలిమేరను అంటనపోటి యీవనిరాముపాలెపుపాలం దేవుని యీనాం తూపలు ౭౫ బ్రాంహ్మణులకు యిచ్చి పొలిమేర హద్దులు నిల్పించి వల్లభాంభాపురం కింద్దరు ... యీ రంగ్గపతిరావు యేలుచూపుండి మంగణాదేశ్వరునకు నిత్యోత్సవంచేశెటందుకు కంచేపద్మసాని అనేసానెకళావతి పడమటి గుడిపూడి పొలంలోను తూపలు ౩౦ యీనాం యిచ్చే గనుకను గుడిపూడి వారు పోలంచూపితే అబ్యూరికరణం కొండయ్య అనే ఆతడు ఆపొలం తమ పూరిదని ఆనవాటు చేశగనుకను ఆ పొలం పద్మసానికె నడిచినది కాదు. ఆనవాటున వుండెను. యివి ౨ న్ను రంగపతిరావు ధరపూ... ర్వప్రక్రియ లబ్దాలు మిరాశీలు అమ్ముకుని దేశాంతరులు అయినవారు. అతత్పూర్వం క్రయాలు లేవు. ప్రధమం క్రయాలుచేసి మీరాశీలు అమ్ముకొని దేశాంతరులు అయిరి. యీ క్రయాలు ప్రళయకావేరి నీడలు కాటూరి కరణం వెలనాడు కొండిన్య గోత్రుడు మంత్రయ అనే అతడు వుద్యోగ సంచారునను వచ్చెను. ఉద్యోగ ధర్మానను వుండి బెల్లం కొండశీమ గ్రామాదులు కొన్నిటికి గుత్తగదారుడై వున్నంతలో స్వస్తికి జయాభ్యుదయ శాలివాహన శక వరుషంబులు ౧౩౨౩ విష్ణుచిత్రభాను సంవత్సరాల వామం తగిలి కొందరు మిరాశి రూకలు విడిచి తరులయి పోయి క్షామం తీరితర్వాతను తిరిగివచ్చి మిరాశీలలో వుండి తర్వాతను స్వస్తిశ్రీ జయాభ్యుదయ శాలివాహనశకవర్షంబులు ౧౭ఽ౩ అగునేటి (1441 AD) రౌద్రి సంవత్సరంవర్కు యీ మంత్రయ బెల్లంకొండ గ్రామాదులకు నిభాచేస్తూ వుండేగనుక రౌద్రి సప్తక ప్రభవ పంచ్చకమని ద్వాదశవర్ష క్షామంతగిలెగనుక నిర్వహించలేకను అర్ధను జీవనము లేనివారు దేశాంతరులయిపోయ్యే టప్పుడు కొండకాపూరు, గురుజేపల్లికి యీ రెండు గ్రామాదుల్కు సంప్రతి ౧ భారద్వాజగోత్రులు బుల్లి గంప వారనేటివార్కి యీ రెండు గ్రామాదులు అంతా అంమ్ముకొని పోదుమని మంత్రయ తోను అనిరి. గనుకను ఆమంత్రయ విచారించి వీసం అయిదు వరహాల చొప్పునను క్రయం చేశె