పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుంటూరు

57


పద్యం :-
రాయరాహుత్తనే రాక యేనుగ వచ్చి
ఆరటుల కోనె కోరాడు రాడు
సంపేట నరపాల సార్వభౌముడు కాంచు
తలుపులకు కురురీ కెల్పునాడు
శెలగొల సింహ్వంబు చెరధిక్కరిజీరి
శింహ్వద్రి జయశీల జెర్పునాడు
గరిమహం నిబ్బరగండ పెండేరంబు
కూంతురి రాయల కొసుగువాడు
చిరజాలదానాడు పూడప్ర
చిక్కితివొ జీర్ణమైతి వొదిక్కులేక
కన్నడం చెట్లు జొచ్చితి గజపతేంద్రా
తెరచి నిలుకుక్క జొచ్చిన తెరవుగాదె ॥

అని అల్లసాని పెద్దన ఉత్తరం అంపించే గనుకను ఆవుత్తరం చూసి అజపతి గజపతి వారు దిరిగి దిగి స్థలముంద్కు పోయిరి. దేశాలు కర్ణాటకం కిందను నిలిచెను. యీవెనుకను రామదేవరాయలు యేలెను. అటుతరువాతను అల్లుడు రామరాజు యేలెను. ఆ తరువాతను జటామాల మాగరాజు యేలెను. యీమాగరాజు స్వస్తిశ్రీ జయాభ్యుదయ శాలివాహన శకవరుషంబులు ౧౩౩౩ (1415 A.D.) అగునేటి స్వభాను నామ సంవత్సరమందునను అత్తోట పొలంలో పాలెం అత్తోట సతూపలు ౧౫ యీవనిపోలంలో తూపలు ౧౫ యీ ౩౦ తూపలకు పాలిమేరహద్దులు పెట్టించి కుంభవరం నామంచేశి శ్రీ ఆగస్తేశ్వరస్వామికి నిత్యదీపారాధన ఖర్చుకు కుంభఅంమ్మసామి అనే సానె వైశ్యవశానను యిచ్చెను. ప్రత్యారితరం వూరు ఆయెను. కుంచవరం ఆయెను ఆతర్వాత అశ్వపతులు యేలిరి ఆతరువాతను సదాశివరాయలు యేలి యితని యేలుబడి ఆగ్రహారాలు యిచ్చెను. శ్రీబ్రాంహ్మతులకు నాగార్ణవ శీతాంశు సంఖ్యాబ్దే శాలివాహనే. క్రోధి సంవ్వత్సరమాహే స్వశాకపురందదౌ

శ్లోకం ॥ చిల్కరులకులేజాతాం వల్లభాచార్య
దేశసంప్రతి సదాశివరాయ పురందదౌ ౹

స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహన శక వత్సరంబులు ౧౪౬౦ (1538 A D.) అగునేటి క్రోధినామ సంవత్సరమందునను చిల్కమర్తి వల్లభాచార్యులుగార్కి చినకూరపాడు ఆగ్రహారం యిచ్చెను. సదాశివరాయదత్తి గోవాడ అగ్రహారం శవర్తుగతి భూసంఖ్యే శాకాబ్దేశాలివాహనే! శ్రీసదాశివరాయేంద్రొ శోభకృన్నామవత్సలే. వల్లభాచార్య విఖ్యాయా చిలకమర్తి కువాయవై! ధర్మ సంస్థాపనార్దాయదదౌ గోసానికాపురే స్వస్తిశ్రీ జయాభ్యుదయ శాలివాహన శకవర్షంబులు ౧౪౬౫ (1543 A D.) అగునేటి శోభకృతునామ సంవత్సర మందు నను గోవాడ యిచ్చెను. ఆకుమర్లపూడి సప్తషష్తాధి భూసంభే శాలివాహనే శ్రీ సదాశివరాయే ద్రావిశ్వరుకు శరద్వజవల్లభాచార్యమర్యాయ చిలుకమర్తికులాయచ యీశ్వరార్పణ బుధ్యా వైహనుమర్ల పురందదౌ, స్వస్తిశ్రీ జయాభ్యుదయ శాలివాహన శకపరుషంబులు ౧౪౬2 (1545 A.D.) అగునేటి విశ్వాసునామ సంవత్సరమందునను అనువర్ణపూడి యిచ్చెను.