పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అన్నపర్రు

5


తరం వెంకట కృష్ణనింగారు స్న ౧౧౬౦ (AD 1750) ఫసలీ లగాయతు ప్రభుత్వం చేస్తూవుండే యడల భట్టుమూర్తి అనే భట్టురాజు పద్యాలు చెప్పినందున కుచ్చెలపొలం మాన్యం యిచ్చినారు. తదనంతరం నవాబు ముఖారసుఖానువారు కొండవీటి ఖిల్లాకు జాహగీరుగా పద్దెనిమీది గ్రామాదులు నవాబు ఫతుల్లాధా౯ ఖిల్లేదారుపరం చేసినారు గనుక అప్పట్లో యీ గ్రామం హవేలీజాహగీరులో దాఖలుఅయి ముప్పై అయిదు సంవ్వత్సరములు జాహగీరు నడ్చినది. రాజా మానూరు వెంకట కృష్ణునింగారు స్న ౧౧౭౮ (AD 1768) ఫసలీ వరకు ప్రభుత్వం చేశిన మీదట యితని కొమారుడయిన నరసన్నారావుగారు వెంకటేశంరావుగారున్ను తాలూకా చేరిసఖం పంచుకునేయడల యీ గ్రామం వెంకటేశం రావువారి వంతులోవచ్చీ సత్తెనపల్లి తాలూకాలో దాఖలు అయినది గనుక వెంకటేశ్వరావుగారు స్న ౧౧౮౨ (AD 1772) ఫసలీ లగాయతు స్న ౧౨౦౫ (AD 1795) ఫసలీ వరకు ప్రభుత్వం చేసిన మీదట యీయన కొమారుడయిన రమణయ్యరావుగారి ప్రభుత్వములో అచ్యుతన్న శేషాద్రి సోమయాజులు యీ గ్రామానకు అధికారానికివచ్చి యీ గ్రామమధ్యమందు శివాలయం కట్టించి విశ్వేశ్వరుడనే లింగమూర్తిని ప్రతిష్ట చేశినారు. స్న ౧౨౦౬ (AD 1796) ఫసలీ లగాయితు స్న ౧౨౨౪ (AD 1814) ఫసలీ వరకు రమణయ్యారావుగారు అధికారంచేసి చనిపోయిన మీదట యీయన తమ్ముడయిన వెంకట్రావు మయినరీలో వున్నారు గన్కు హానరెబల్ కుంఫిణీవారు మేనేజర్ల పరంగా అమానీ మామిలియ్యతు జరిగించుకొంటూ వున్నారు. యీ గ్రామంలో విశ్వేశ్వరస్వామి దేవాలయంగా ఆంజనేయుల దేవాలయం ౧యీ రెంటికి పూజా నైవేద్యాలు జర్గుతూవున్నది.

(యిక్కడ స్థలం మూలంలో ఖాళీగా వున్నది)