పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

అన్నపర్రు

కయిఫియ్యతు మౌజే అన్నంపర్రు. సముతు నాదెళ్ల,

తాలూకే సత్తెనపల్లి యిలాకే రాజామానూరు వెంకట్రావు

మయినరు జమీదారు స్న౦౨౨౭ ఫసలీ మజుకూరి కరణాలు

అనపర్తి క్రిష్ణమరాజు, బుచ్చిరాజు, పెరుమాళ్ళు శేషప్ప,

మంత్రప్ప మొదలయినవారు వారియించినది.

పూర్వం బొబ్బిలి దేవమహారాజు బొబ్బిలిపట్నంలో వుండి రాజ్యభారం చేస్తూవుండగా అప్పట్లో అతిసంమ్మంధమయిన జయినులు కొందరు యీస్థలానికివచ్చి గ్రామం యేర్పరచుకొని రాజవోలు అని నామాంకితంవుంచి కొన్ని దినములు ఆస్థళమందు కాపురంవుండి కాలాంతర అవస్థ చాతను జయినులు ఖిలపడిపోయిన మీదట ఆస్థలం పాడయి దిబ్బగావుండగా దక్షిణాది చిరమన కాపరస్ధులయిన అన్నంరాజు చిగిలిరాజు కోనంరాజు అనేవారు అన్నదమ్ములు అర్థవంతు లయివుండి యీదేశానకువచ్చి యీజయినుల సంమ్మంధమయిన వాటిమీద అన్నంరాజు తన పేరిట గ్రామంకట్టుకొన్నందున గ్రామానికి అన్నంపర్రు అనే వాడికె వచ్చినది. గజపతి సింహాసనస్థుడైన గణపతిదేవ మహారాజులుంగారు ప్రభుత్వంచేస్తూ వుండేయడల వీరివద్ద వుండే మహా ప్రధానులయిన గోపరాజు రామన్నగారు సమస్తమయిన నియ్యోగులకు గ్రామకరిణీకపు మిరాశీలు నిర్ణయించే యడల యీగ్రామానికి యజుశ్శాఖాధ్యాయనులున్ను శ్రీవత్సస గోత్రులయిన అన్నపర్తివారికి మిరాశీ యేకభోగముగా యిచ్చినారు. తత్సంతతివారు పరంపరా అనుభవిస్తూ వున్నారు. అప్పట్లో సదరహీ గ్రామ మిరాశీదార్లు అయిన అన్నంపర్తివారు యీగ్రామమధ్య మందు ఆంజనేయస్వామి వారికి ఆలయం కట్టించి ప్రతిష్ట చేసినారు. తదనంతరం మల్కీ విభురాంపాదుషహవారు దేశం ఆక్రమించుకొని సముతుబందీ వగయిరాలు నిర్నయించేయడల యీగ్రామం నాదెళ్ల సముతులో దాఖలు చేసి సముతు చవుదరు, దేశ పాండ్యాలు అమీన్లు పరంగా అమానీ మామ్లియ్యతు జర్గించుకొంటూ వచ్చినారు. స్న ౧౧౨౨ (1712 AD) ఫసలీలో ముఖార సువారు కొండవీటిశీమ జమీదార్లకు పంచిపెట్టేయడల యీగ్రామం సర్కారు మజుందారు డయిన మానూరు వెంకన్న పంతులు వంటులో వచ్చి చిల్కలూరిపాటి తాలూకాలో దాఖలు అయినది గనుక వెంకన్న పంతులు ప్రభుత్వం చేస్తూన్ను యీ గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామివారిని పునః ప్రతిష్ట చేసి గుడికట్టించి నిత్య నైవేద్య దీపారాధనలకు యిచ్చిన మాన్యం-కు ౦౺౦ యీదేవస్థానం భజంత్రీలకు యిచ్చిన మాన్యం కు ౦౺౦ యీ గ్రామం యొక్క కాపు నొల్లా మూర్తి వేయించిన చర్వుకు యిచ్చిన మాన్యం కు ౦౺౦ యీప్రకారముగా వెంకన్నగారు స్న ౧౧౪౦ (AD 1730) ఫసలీ వరకు ప్రభుత్వం చేసిన తదనంతరం యీయన తమ్ముడయిన అప్పాజీ పంతులు ప్రభుత్వంచేశిన మీదట యీయన కొమారుడు వెంకట్రాయునింగారు అధికారంచేస్తున్ను స్న ౧౧౪౪ (AD 1734) ఫసలీలో మజుకూరి కాపు అయిన నొల్లా రవణప్ప పొలిమేర తొక్కినందున యితనికి కు ౦౺౦ పొలిమేర మాన్యం యిచ్చినారు. తదనం