పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

గ్రామ కైఫియత్తులు


రాయులు తిరుమలరాయుడు శ్రీ రంగరాయులవారి ప్రభుత్వం శాలివాహనశకం ౧౫౦౦ (1578 A. D) వరకు జరిగిన తరువాత శాలివాహన శకం ౧౫౦౨ (1580 A. D.) లగాయతు మల్కి విభురాంపాడుషహవారు కన్నా౯ట్క రాజుల జయించ్చి కొండవీటి దుగ౯ం పుచ్చుకొని ప్రభుత్వం చేశేటప్పుడు సర్కారు సముతుబందీలు చేశే యడల యీ ప్రత్తిపాడు విస్తారంగ్రామం గనుక యిది కనుపా (బా) చేశి దీని కింద........ యీ గ్రామాదులు యీకసుపా (బా) కింద చెల్లేటట్లు చేశి ప్రత్తిపాటి సముతు అనిపేరు పెట్టి సముతు అమీలు దేశముఖు దేశపాండ్యామజ్ముంద్దారు పరంగ్గా మామ్లియ్యతు చెల్లేటట్టు......యీ కసుపా (బా) లో వుండే స్వామివాల్ల౯కు పూర్వోత్తరములు వృత్తులు జప్తుచేస్కుని పునహ వీరి పరంగ్గా చేశ్ని స్వాస్త్యములు.

కు ౫ శ్రీస్వామివాల౯కు నిత్యనైవేద్య దీపారాధనలకు

౨ ౺ ౦ శ్రీగండ్లేశ్వరస్వామివారికి
౨ ౺ ౦ శ్రీ వేణుగోపాల స్వామి వారికి

వో ౬ ౦ కధాత్యవములు మొదలయ్ని సాలి అసోపండ్డుగలకాత్తి౯క మాస శ్రావణమాసాభిషేకములు నవరాత్రి శ్రీరామనవమి గోకులష్ఠమి నవరాత్రములకు

౩ ౦ శ్రీగండ్లేశ్వరస్వామివారికి
౩ ౦ శ్రీవేణుగోపాలస్వామివారికి

కు ౬ శ్రీస్వామివారి దగ్గర వార చేశేభాగవతులకు స్వస్తివాచకులకు భజంత్రీలు వగయిరాలకు చెశ్ని భూస్వా స్యములు

౨ స్వస్తివాచకులకు
౨ భాగవతులు వగయిరాలు
౧ భజంత్రీలకు

యీప్రకారంగా నిన౯యించ్చినారు గనుక తదాప్రభుతి జరుగుతూ వుంన్నది --

స్న ౧౧౨౨ (1712 A. D) ఫసలీలో సుబావారు కొండవీటిశీమ వంట్లు చేశి వంట్లు పంచి పెట్టే యడల యీగ్రామం సర్కారు మజుందారులయ్ని మానూరి వెంకన్న పంత్తులు గారి వంట్టులోవచ్చి చిల్కలూరిపాడు తాలూకాలో దాఖలయ్నిది. గన్కు వెంక్కన్న పంత్తులుగారు ఆప్పాజీ పంత్తులు వెంక్కటరాయునింగారు నరసంన్నగారి తుమ్ములు వెంకంన్న గారి కొమారులయ్ని వెంక్కట కృష్ణునింగారు ప్రభుత్వంచేస్తూ పయిని వాశ్ని స్వామివాల౯ కు సకల వుత్సవములు జరిగిస్తూ వుంన్నారు——

శ్రీ గండ్లేశ్వరస్వామివారి దేవాలయాన్కు పశ్చిమ భాగమంద్దు వీరభద్రస్వామివారి దేవాలయం అనాదియ్యమయ్నిది వుంన్నది———

యీ దేవాలయాన్కి పశ్చిమభాగమంద్దు విఘ్నేశ్వరుడి దేవాలయం వుంన్నది.