పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుంటూరు

69


త్తున్ను ఆక్రమించ్చుకొని యీ అరణ్యమందు వుండ్డే గుండ్డుంన్ను యీ లింగాంన్నింన్ని చూచి యిది మహాపురుషుల ఆశ్రయమన్నింన్ని యిక్కడ గ్రామనిర్మాణం చెయ్యవలెనని యోచన చేశి యీ గుండుకు ఆగ్నేయభాగాన గ్రామనిర్మాణం చేశి గుంటూరు అనే నామధేయం వుంచి యీగుండుకు దక్షిణభాగమందు వఖజయిన ఆలయం కట్టి జనబింబ ప్రతిష్ట చేశి పార్శనాధు తీర్థంకరరు అనే నామధేయం వుంచి సమస్త పూజోత్సవములు నడ్పించినారట యిందుమాత్రం తెలుస్తుంన్నది.

వీండ్లు వుంటున్నది ఆ తదనంతరం కొంన్నిదినాలుకు మోహనరాజు గోపాలరాజు అనే రాచకొమారులు యిద్దరు వుత్తరదేశం నుంచి కుష్టు వ్యాధిచాత అనేక తీర్థయాత్రలు చేస్తుంన్ను అనేక బలంతోటి యీ గుంటూరి మార్గంగాను వచ్చి యీ గుండువద్ద మొకాంచేసి యిద్దరున్ను వినోదార్థంగా యీ గుండుమీద యెక్కి యీ గుండుకింద వుండేటి తీర్థం చేతోటి తీసుకొని చల్లుకొని వళ్ళు యావత్తును తడుచుకొనేటప్పుట్కు ఆకుష్టురోగం దురదల్యాకుండ వుండేటపుట్కి అప్పుడు వీరు యీ తీర్థములో యేమో మహాత్యంవున్నదనింన్ని యోచనచేశి యీ తీర్థములో ఆరునెలలు స్నానపానం చేశేటప్పట్కి కుష్టు విమోచనము అయి పరిశుద్ధదేహులయినందువల్ల ఆపుడు వీరు తెచ్చిన ధనం యావత్తున్ను వ్రాయంచేసి యీగుండు పగలకొట్టి యీ గుండు కింద బ్రహ్మాండమయిన ఒక చెరువుగా తొవ్వించి యీ చెరువుకు పూర్వభాగమందు సోపానులు కట్టి అక్కడ వినాయకుంణ్ని ప్రతిష్టచేసి వినాయక పట్టమనాన్కి నామధేయం వుంచి యీ అగస్తేశ్వర గోపాలస్వామివార్కి గర్భగుడి మొఖమంటప ప్రాకారములు కట్టించి సమస్త పూజోత్సవములు జరిగించినారు.

తదనంతరం విష్ణువర్ధన మహారాజు రాజ్యం భారం చేస్తున్ను వుండి యీ కొండ్డవీటి శీమలో అనేక అగ్రహారాలు యేర్పరచి బ్రాంహ్మణులకు యిచ్చినందుకు దాఖలా యీశీమలో అనేక మంది వారు యిచ్చిన అగ్రహారాలు అనుభవిస్తుంన్నారు. అపుడున్ను యీగుంటూరు అగస్తే శ్వర గోపాలస్వామివారికి సకల వుత్సవాలు యాధావిధిగా జరిగినవి ఆతదనంతరం వడ్డేవాండ్లును మహాప్రబలమయి వుత్తరాదినుంచి యీ కొండ్డవీటి శీమకు వచ్చి యీశీమ యావత్తును ఆక్రమించుకొని యీశీమ యేలుతూవుండగాను తూర్పు శీమ నుంచి రెడ్డివాండ్లు యీ కొండవీటికి వచ్చి యీవడ్డేవాండ్లుతోటి యుద్ధంచేశి జయించి యీశీమ యావత్తు తమ స్వాధీనం చేసుకొని యేలుతూ వుండగా యిప్పుడు వుండే యీ వాశిరెడ్డివారి పూర్వులు రెడ్డివారితోకూడా కొండ్డవీటికివచ్చి వారి శాయహగాలతో తిరుగుతూవుండి వారి అనుగ్రహం సంపాదించుకొని వారివల్ల యీశీమలో కొన్ని సమతులు జాగీరుగా అనుభవించినారు. ఆమీదట వారివాహన శకవరుషంబులు ౧౫౩౧ (1109 A.D) అగునేటి క్రవ సంవత్సర మందు శ్రీమన్మహామండలేశ్వర రామదేవరాయలు ప్రధివిరాజ్యం చేయుచుండగాను అప్పుడు యీగుంటూరుకింద దసాలేశులుగు పాటెలు చెల్లుతూ వుండేది. అపుడు వీరి కార్యకర్తలయ్ని సాళ్వతిమ్మరసయ్య అయిండ్లు నాదేండ్ల అప్పరయ్యగారు యీ గుంటూరికి అయిదు సంప్రతులు కరణాలును యేర్పరచి పూర్వం వాశిన దండకవిలెలు ప్రకారం యీగుంటూరి మిట్ట మెరగరి అద్దులు యేర్పరచి యిచ్చినందుకు దాఖలా యీ గుంటూరి కరణాల దండకవిలె హజూరు వుంన్నది. ఆమీదుట కొంన్నిదినాలకు వాశిరెడ్డి వీరప్ప నేడు అనేకంమ్మఅయిన సదరపా రాయలవద్దకిపోయి వీరిని అను నరపక్షంచేశి వీరి కార్యభోగాలు చక్కపెట్టుతున్నూ వుండి వారి అనుగ్రహం సంపాయించుకుని వారి నుంచి నందిగామ శీమ