పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

గ్రామ కైఫియత్తులు


యీ రీతున కొంన్ని సంవత్సరంబులు జరిగించిన తదనంతరమందునను యీ అడ్సుపల్లి వారు వదలి పోయిరిగనుకను గరికిపాటివారు గోరంటవారు తిరిగి గ్రామాదులలోకి వచ్చిరి గనుకను యీకట్టమూరి నియోగ్యులు గోరంట కరణీయం తనదని మల్లాడివార్కి కరణీకం వుత్తేజో పార్జనలు యివ్వకపోయిరి గనుక యీ కట్టమూరినియ్యోగులు మల్లాడివారు వుభయత్రులు కలత పెట్టుకుని తగవున పడిరి గనుకను తగువువారు పెద్దలయ్ని వారు విచారించి యీగ్రామము రెడ్లవారు యిచ్చిన మిరాశీ యీవెన్కను రాయలవారు మిరాశీ యజమానత్వం యిచ్చి నారు సూకు కరణీకం యేరీతినవచ్చినదిని అక్సుపల్లివారు వీరులేకుండగాను మీ చాతను వాయించుకొన్నారు అని తగుచె పెట్టి వారు మల్లాదివారిని కట్టమూరినియ్యోగులును పాప పుణ్యాల్కు దలణోలచేసి కట్టమూరి నియోగ్యులును మల్లాదివారి చాతను తగూవారు జీతంకిందను యాభై వరహాలు యిప్పించి నియ్యోగుల్కు అక్కరలేకుMడ చేశిరి. శ్రీ శ్రీ యీ రెడ్లు యిచ్చిన అగ్రహారపు వూండ్లవారు తమకు నడువక పాయనని అంన్నారు గనుకను యీ వెన్కను నాలుగు అయిదు గ్రామాదులవారు రాయదుర్తిపల్కులు చేయించినారు. గనుకను కృష్ణదేవరాయలు అగ్రహారాలు నడిపించెనూలేదు. తాను యివ్వలేదు. సంప్పటం కోనప్ప వాయించిన ప్రకారము ॥

శ్రీ శ్రీ శ్రీ రామ ॥ శ్రీ శ్రీ ఆంజనేయ॥

శ్రీకృష్ణార్పణమస్తు......

11

గుంటూరు అనేది పూర్వం అరణ్యముగా వుండి అగస్త్యులున్ను గౌతములున్ను వీలు౯ గుళ్ళు నిమా౯ణంచేసి గ్రామం యేప౯రిచి అచ్చట వక పెద్ద గుండు వుంన్నందున గుంటూరు అనే వుంచిరి.

తాలూకే చింతపల్లి, సర్కారు ముర్తుజాన్నగరు. బుచ్చయ్య పొత్తూరి సుందరరాము వారు వాయించినది.

పూర్వం యీ గుంటూరు కేవల అరణ్యంగా వుండేటప్పుడు త్రేతాయుగమందు అగస్త్యులున్ను గౌతమ లున్ను సంచారార్థమయి యీ అరణ్యానికి వచ్చినంతట యీ అరణ్యమందు వఖ బ్రహ్మాండమయ్ని గుండు వుండేది. ఆ గుండువద్ద వఖ కుటీరము యేర్పరచుకొని యీ గుండుకింద ఒక తీర్థం నిర్మాణంచేసి యీ గుండుకు యీశాన్యభాగమందున అగస్త్యులు లింగ ప్రతిష్టచేసి అగస్తేశ్వరుడనే అభిదానం వుంచినారు. యిందుకు దక్షిణభాగం గౌతములు విశే ప్రతిష్ట చేసి గోపాలస్వామివారనే అభిదానం వుంచి పూజోత్సవములు చేసి కొంన్ని దినాలు యిక్కడ అగస్త్య గౌతములు వాసంచేసినారనింన్ని యిక్కడ స్తళజ్ఞులు చెప్పుతున్నారు. యిక్కడి స్తళపురాణం అవాంతంలో పోయ్నిదనింన్ని చెప్పుతున్నారు. ఆమీదట కలియుగా నంతరం జయనులు మహాప్రబలమయి కాశీనుంచి ప్రదేశాన్కి వచ్చి యీశీమ యా