పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపోద్ఘాతము

విజ్ఞాన చంద్రికామండలి స్థాపించబడిన 1906 వ సంవత్స రమునుండియు నే దేని దేశ చరిత్రమును తెనుగులో వ్రాసి యొకిం చుక మాతృభాషా సేవ చేయవలెనని నాకు కోరిక యుండెను. కాని అట్టి భాగ్యము నాకిదివరకు లభించ లేదు. ఇప్పుడు భగవదను గ్రహము వలన నాకట్టి వీలు కలిగి ఫ్రెంచి స్వాతంత్య విజయ మను దేశ చరిత్రను ఆంధ్ర భాషామతల్లి యొక్క యడుగుదమ్ముల కల్పించుకొనుచున్నారు. ఫోన్సు దేశము యూర పుఖండము నకు హృదయముషంటిది. ఫొస్సు దేశ చరిత్ర తెలిసికొనుట పలన యూరపులో బయలు దేరిన మత సొఁఘిక రాజకీ యోద్య' మముల తత్వము తెలియగలదు. గంధవిస్తర భీతి చే నీచరిత్రను రెండు సంపుటములుగ విభజించి ప్రధమసంపుటములో చరిత్ర ప్రారంభమునుండియు ఫ్రెంచి విప్లవమువరకును వ్రాసితిని. ప్రెంచిచరిత్ర మీగ్రంథములో ప్రధానముగానున్నను యూ రఫు ఖండ స్థితికూడ సంగ్రహముగా చూపుచువచ్చితిని.


నేనాంధ్రదేశమున విద్వాంసుడను కాను. గ్రంథము వ్రా యుట కిదే ప్రథమప్రయత్నము. ఈ గ్రంధములో న నేక తప్పు లున్నవి. సదయహృదయులై పండితులు నాతప్పులను క్షమిం కురుగాక. .