పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
8

ప్రెంచి స్వాతంత్ర్య విజయము


క్లోవిసు దండెత్తి దేశము సంతను నాక్రమించుకొనెను. ఈయన క్రైస్తవమతమును స్వీకరించెను. ఫాన్కులు గాలును జయించి ఆక్రమించుకొనుటవలన గాలునకు ఇంతటినుండియు ప్రాస్సు, దేశమని పేరు వచ్చెను.

మేయర్లు

మరణించిన తరువాత సాన్కుల రాజ్యవై భవము .క్షీణించెను. నూరు సంపత్సరముల వరకును రాజకుటుంబము అంతఃకలహములతోను చెప్పవలనిగాని కల్లోలములతోను నిండియుండెను.. క్లోవిసు యొక్క వంశమువారు ఆయన సామర్ధ్యమును కలిగి యుండినందున కొలది కాలములోనే పలుకుబడిని పోగొట్టుకొనిరి. వీరి తాబేదార్లగు మేయుర్సు ఆప్ ది పాలస్, రాజసగర పాలకులను ఉగ్యోగస్థలు క్రమముగా రాజ్యాధికారమును చలాయించసాగిరి. వీరి ప్రమేయమున రాజనగరుకు 'సంబందించిన ఉద్యోగస్తులు. రాజులు బలహీను లైన కొలదియు వీరు బలపంతులై రాజుల పేర యావత్తు ఆధకారమును చలాయిం చుచువచ్చిరి. శివాజి చత్రపతి యొక్కవంశీకుల పేర పేష్వాలు మహారాష్ట్ర సామ్రాజ్యము నేలినటుల ఫ్రాన్సు దేశమును రాజుల పేర మేయర్లు పరిపాలించిరి. రాజుల హక్కులు వంశ పారం పర్యముగ నున్నటులే ఈ మేయర్ల హక్కు లుగూడ వంశ పారంపర్యముగ స్థిరపడినవి. ఈ యుద్యోగమునకు 687 వ సంవత్సరమున పిప్పిన్ అనునాయన వచ్చెను. ఈయన బహు సమర్థుడు. ఈయన రైను నదీ ప్రాంతముననున్న ఫ్రాన్కులను జయించి రాజ్యమును విస్తరింపజేసెను. పిప్పిన్ చనిపోయిన తరు