పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/18

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి అద్యాయము

ఫాస్కులు,

రోమకసామ్రాజ్యము కిందనుండి గాలులు కొంత నాగరికతను నేర్చుకొనిరి. కానీ తమస్వతం త్రశక్తిని ధైర్యసాహసములను గోల్పోయిరి. రోమక చక్రవర్తులు గాలులను తుపాకి, కత్తి మొదలగు ఆయుధములను ధరించగూడదని ఆయుదచట్టము నొక దానిని చేసిరి. తమ మీద తిరగబడి గాలులు తిరిగి స్వతంత్రమును పొందకుండ నుండుటకై ఇట్టి శాసనము చేయబడెను. నాలు గవ శతాబ్దములో రోమను రాజ్యము మిగుల బలహీనమై ఆ నాగరికులగు జర్మను జాతులచే ముట్టడించబడి ఇటలీ దేశమునే రక్షించు కొన లేని స్థితియఁ దుండెను. గాలు మొదలగు రాష్ట్ర ములకు తగిన సంరక్షణ నీయ లేక పోయెను. అప్పుడు గాలు మీదికి జర్మను జాతులగు ప్రాన్కులు దండెత్తుచు దోచుకొను చుండిరి. ఇంతలో కాన్ స్ట్రాటిన్" చక్రవర్తి. ఫ్రాన్కుల నోడించి కొంతవరకు గాలులను సంరక్షించెను.

ప్రాస్కుల రాజ్య స్థాపన

కాని కొలది వత్సరములలోపలనే రోమక రాజ్యము నలు వైపులనుండియు ననాగరికులగుజాతులచే దండెత్తబడి విచ్ఛిన్నము చేయబడినది. గాలుమొదలగు రాష్ట్రము లలోని సైన్యములను ఉద్యోగస్తులను రోమకు పిలిపించుకొనిరి. రోమక 'రాజ్యముచే చేయబడిన ఆయుధ చట్టమువలన నాలుగువందల సంవత్సరములు ఆయుధములు ధరించుటకు వీలు లేక , గాలులు స్వసంరక్షణ చేసికొనజూలని నిస్సహాయ స్థితియందుండిరి. రోమనులు దేశమును వదలగనే గాలు దేశము పైకి పాస్కులరాజగు