పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
141

పదియవ అధ్యాయము


స్త్రీలు దుకాణదార్ల కెంత సొమ్మయిన నిచ్చిరి. ఆయన వ్రా సిన మాటలు ఒక గొప్ప ప్రవక్త యొక్క సందేశములని ప్రజలు నమ్మిరి. సంఘములో గొప్పవారమని అనుకొను వారి యొక్క యు, పుట్టుక వలన అధికులమని అనుకొనువారి యొక్కయు, ధనికుల యొక్కయు, బిరుదములు గలవారియొక్కయు దురాశ, మోసములు, దేశ ద్రోహములు హృదయాకర్షణముగ వర్ణించి సామాన్య ప్రజలలో వారియంద గౌరవమును కలుగ చేసెను. గ్రామములను విడువవద్దు. బస్తీలలో చేర వద్దు. బస్తీలలో చెడిపోవుటకు మార్గముల నేకములు గలవు." పల్లెటూళ్లే స్వచ్ఛమయినవి, నీతిమంత మయినవి,” అని అయన, వ్రా సెను. పల్లెటూళ్ళలో కాయకష్టము వలన జీవించు పేదల యొక్క ఆడంబరము లేక నీతిమంత మైనట్టియు, దురాశా ప్రేరిత ములు కానట్టియు, మితవ్యయము గలిగి నట్టియు, చవితముగా సౌఖ్యవంతమయినవనియు ఈశ్వరునికి మిక్కిలి ప్రీతికరమని యు చూపెను.. 1752 వ సువత్సరమున ఆయన 'సోషల్ కంట్రాక్టు' అను గ్రంథమును వాసెను. . ఇది ఆయన వ్రాసిన గంధములలో కెల్ల ముఖ్యమైనది. రాజులు దైవాంశ సంభూతు లను సిద్ధాంతము స్వార్థ పరులచే కల్పింపబడినదని వ్రాసెను. " దేశము ప్రజలది. ప్రజలు మొదట ప్రభుత్వములు లేక ఎవరి యిష్టమువచ్చిన, విధమున వారు ప్రవర్తింపుచు సం పూర్ణ స్వేచ్ఛను గలిగియుండిరి. కాని కలహములు కలుగు చుండెను. శాంతి కలిగియుండుటకై ప్రజలందఱును కలిసి ప్రభుత్వము నేర్పఱచుకొసిరి. రాజులుగాని మరి యే ప్రభు