పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

137

పదియవఆధ్యాయము

ములను పూర్తిగా మార్చివేసెను. " మేము విప్లవమునకు విత్తులు వెదజల్లుచున్నాము. విప్లవము రాకతప్పదు" అని వాల్టేరు పండితుడు 1762 వ సంవత్సరమున వ్రాసెను. 1778 వ సంవత్సరము. ఫిబ్రవరి నెలలో ఎనుబదియారు సంవత్సరముల వయస్సు నీ మానవ స్వాతంత్య వాది పారీసు నగర మును దర్శించెను. అప్పుడు ప్రజలు గొప్ప యుత్సవము చేసిరి ప్రజలు గుంపులు గుంపులుగ నాయన దర్శనమునకై వచ్చి, యా యన యింటిముందర నాదిన మంతయు వేచియుండిరి. వాల్టేరు చిరం జీవి: యగు గాక" అను ద్వనులే ఏమూల జూచిసను చెలరేగెను. దీనితో. రాజులు కూలిపోయెదరుగాక ! తత్వజులు ప్రబలుదురు గాక!” అను కేక లుకూడ మిళితములయ్యెను. ఆమెరికా స్వాతం త్ర్యై నాదియగు బెంజమిన్" ఫ్రాన్కులను తనమసుముని వాల్టేరు యొక్క యాశీర్వచనముకొరకు గొనిపోయెను. పిల్లవాని శిర మున తన హస్తముంచి " భగవంతుని యనుగ్రహమును, స్వాతం త్వమును పొందుదువుగాక" యని యా జగద్విఖ్యాతపురుషు డాశీర్వదించెను. మార్చి 30 తేదిని ప్యారిసుసందలి యొక సుప్ర సిద్ధ నాటక శాలలో నాయన రచించిన "బరిన్ అను నాటకము ను ప్రదర్శించిరి. ఆయన శిరమున పుష్పకిరీటము సుంచిరి. స్త్రీలు తమ రెక్కలమీదనే యాయనను నాటక శాలనుండి బండిలో నికి గొనిపోయిరి. వురుష, లాబండిని ఆయనయంటి కీడ్చుకొని పోయిరి. ఆయన మీదపడిన పుష్పగుచ్ఛములకును, విరిదండల కును మేర లేదు. "నాబిడ్డలారా! నన్న గులాబీ పుష్పముల కింద అణచి వేయదలచుకొన్నారా!" అని యూముదుసలి ప్రశ్నించెను