పుట:February 2020.అమ్మనుడి.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉత్తరంలో “ఆమె” పేర్కొంటుంది. మద్రాసు వాతావరణం బాగుంది. ఇళ్లు విశాలంగా ఉంటాయి. చర్చి అంత పెద్ద గదులు. తలుపులు, కిటికీలు ఎప్పుడూ తెరిచే వుంచుతారు. గాలీ వెలుతురు బాగుంటాయి. ఇటలీ ఇళ్ల మాదిరి వేడి అనిపించదు, ఉష్ణోగ్రత 78 డిగ్రీలున్నా ప్రతిగదికీ వట్టివేళ్ల తడికలుండడం వల్ల 70 డిగ్రీలు మించినట్టుందదు. మద్రాసులో ఆమె తన సోదరుడు స్టాన్‌టన్‌ యింట్లో బస చేసింది. మద్రాసులో తాను చాలా వింతలూ, విశేషాలు చూశాననీ, వాటిలో దేన్ని మొదట చెప్పాలో తెలియడం లేదని ఆమె అంటుంది. “గారడీ వాళ్ళను గురించి చెప్పనా, పాములవాళ్ళు, దొమ్మరివాళ్లు, స్థానికులు... వీళ్లలో ఎవర్ని గురించి చెప్పమంటావు?” అంటూ పాముల వాళ్లను గురించి మాత్రమే చెప్తుంది. పాములను ఆడించే వాళ్లు చాలా చిత్రంగా ఉంటారు. తాము ఆడించే పాములు విష సర్పాలని, వాటిలో బ్రాహ్మణ నాగు మరీ భయంకరమైనదన్సీ అది కాటువేస్తే మూడు గంటల్లో మనిషి ప్రాణం పోతుందని వాళ్లు చెప్తారు. నెలకోసారి కోరలు తీసేస్తామని వాళ్లు చెప్పారు కానీ, వాళ్లు తీసేది కోరలు కాదు, కోరల్లో విషం అనీ ఆమె అంటుంది. ఒకరోజు పాములవాళ్లు ఎనీమిది నాగుపాముల్ని మూడు సాదా పాముల్ని తెచ్చి తన ముందు అద్భుతంగా ఆడించారనీ ఆమె రాస్తుంది. సంపన్నుల యిళ్లల్లో నౌకర్లను చూసి ఆమె చాలా ఆశ్చర్య పోతుంది. ప్రతి చిన్న పనికీ నౌకర్లమీద ఆధారపడడం, ఒక్కొక్క పనికి ఒక్కో నౌకరుండడం, నౌకర్ల కింద మళ్లీ నౌకర్లు - ఇదంతా ఆమెకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. తన వద్దనే ఇద్దరు నౌకర్లు - ఒక “ఆయా మరో దర్జీ వున్నారు. “ఆమో భర్త వద్ద ఒక “బోయ్‌” వున్నాడు. వీళ్లు కాక, ఇంట్లో పాచిపనికి ఇద్దరు, ఇల్లు శుభ్రం చేయదానికిం కొకరు, నీళ్లు తేవదానీకి మరొకరు, గుద్దలు పరచదానికొకరు, భోజనం వద్దించదానికి, దీపాలు వెలిగించడానికి, డైనింగ్‌ టేబుల్‌ వద్ద కాచు కాని వుండదానికి వేర్వేరు పనివాళ్లుంటారు. “ప్రతి గుర్రానికీ ఒ సేవకుడు, గడ్డి కోసుకొచ్చేందుకొక ఆడ పనీ మనిషి. ప్రతి కుక్కకు ఒక నౌకరు. పిల్లులకు వుందరా అని అడిగాను. ఉహు... ఉందరట. బహుశా అదొక్కటేనేమో - తన పని తాను చేసుకోగల ప్రాణి ఇక్కడ” అని ఆమె వ్యాఖ్యానిస్తుంది. ఒక్కోయింట్లో యింతమంది పనివాళ్లున్నా వాళ్లు చేసే పని మాత్రం ఎక్కువేమీ వుండదు. కనబడే నౌకర్లు వీళ్లయితే, కనబదకుందా మరికాంత మంది - ఈ నౌకర్ల కింద నౌకర్లుంటారు. అసలు పనంతా చేసేవాళ్లు...ఐతే ఎంత మంది నౌకర్లున్నా పనీమాత్రం తెమలదు. నేను ఈ నౌకర్లకోసం కాచుకోళ, నా పనులు నేనే చేసుకుంటాను. అంతా చేనుకుంటుంటే మిసెస్‌ స్టాన్‌ టన్‌ నన్ను ఎగతాళి చేస్తుంది” నౌకర్లు యజమానుల యిళ్లలో మెట్లమీద చాపలు పరుచుకొని వుంటారని, అక్కడ ఏమీ తిన్నట్టుగానీ అనిపించక పోయినా తమకు కావలసినవన్నీ చక్కగా సమకూర్చుకాంటారని ఆమె అంటుంది. “నీజమ్రైన భారతీయ మహిళ ఎల్లవేళలా సోఫామీద పడుకొని వుంటూ, చేతి గుట్ట మీదపడి పోయినా “బోయ్‌ అని కేక వేస్తుంది. అప్పుడొక బక్క పల్చ్బనీ ముసలాడు మెల్లగా లోపలికి వచ్చి యజమా నురాలు చెప్పిన పనిచేసి, పిల్లిలా మెల్లగా బయటకు జారుకొని, యధా (ప్రకారం వరండాలో కాళ్లు పెనవేసుకొని కూచుంటాడు - మళ్లీ అమ్మగారికి దయకలిగి తనను పిలిచే దాకా!”

| తెలుగుజాతి పత్రిక జఅవ్మునుడి తి ఫిబ్రవరి -2020 |

ఈ దేశస్థులు (నేటివ్‌లు) హేయంగా ప్రవర్తిస్తారని, 'నక్క వినయం” చూపేవారని, తాము ఇంగ్లీషువారి కాలి దుమ్ముతో సమాన మైనట్లు నదుచుకొంటారనీ ఆమె అభిప్రాయం, ఐతే వాళ్లు తమను గురించి అంత నీచంగా భావించుకొనేట్లు చేసింది. ఇంగ్లీషు వాళ్లేననీ ఆమె అంటుంది. “వాళ్ల నీచమ్రైన దాస్యభావం సహించరానిదే అయినా, వాళ్లను మన ఇంగ్రీషువాళ్లు మఠీ హేయంగా, మొరటుగా చూడడం ఎంతో బాధాకరంగా ఉంటుంది. నౌకర్లతో కాస్త మర్యాదగా మాట్లాడేది కొత్తగా ఇండియాకు వచ్చిన వాళ్లు మాత్రమేనని, వాళ్లు తెలియక అలా మాట్లాడుతారని ఇక్కడి ఇంగ్లీషువాళ్లు అంటుంటారు”. అని ఆమె వ్యాఖ్యానిస్తుంది. దీనికి తన “ఆయా'తో సంభాషణను, దర్జీ సంఘటనను ఉదాహరణగా చెప్పంది.

ఒకరోజు ఆమె ఆయాను రొట్టె, నీళ్లు తెమ్మనీ చెప్పూ “సజ అని మర్యాదగా అంటుంది. రొట్ట, నీళ్లు తెమ్మనడమైతే సరేగాని, ఆ ప్లీజ్‌ అనే మాటేమిటో ఆయాకు అర్థం కాలేదట. ఆయా తలువు దాకా వెళ్లీ తిరిగి వచ్చి -

“ఏం చెప్పావమ్మా?” అనీ అడుగుతుంది.

“రొట్టె, నీళ్లు తెమ్మన్నాను”

“అది సరే కానీ ఆ తరువాత ఏదో “ఇఫ్‌ యు ప్లీజ అన్నారే. అంటే ఏమిటమ్మా?” అంటుంది అమాయకంగా. అలాటి గౌరవ వాచకాలతో తననెవరూ పిలవలేదట. 40 ఏళ్ల వయస్సు. లావుగా

బొద్దుగా వుందే ఆయాకు ఏర్‌కుషన్‌కి గాలి ఊదటమంటే మహా సరదా.

ఒకసారి తన దర్జీ సూచించిన ముసల్మాన్‌కు “ఆమె” కొంత ఎంబ్రాయిడరి పని అప్పగిస్తుంది. ముసల్మాన్‌ ఎంతకూ పని పూర్తి చేయకపోయేసరికి, “ఏంచేద్దాం” అని మిసెస్‌ స్టాన్‌టన్‌ను సలహా అడుగుతుంది. మిసెస్‌ స్టాన్‌టన్‌ చాలా తేలిగ్గా -

“ఏముంది? వర్జీ జీతం పట్టి వుంచు” అని సలహా చెప్తుంది.

“కానీ పాపం ఇందులో దర్జీ తప్పేముంది?”

“అదంతా అటుంచు. అతను ముసల్నాను స్నేహితుడు. నీ వతని జీతం పట్టి వుంచావంటే, అతను నీ ఎంబ్రాయిడరి పూర్తయ్యే దాక రోజూ తన స్నేహితుణ్ని చావబాదుతుంటాడు - మిసెస్‌ స్టాన్‌టన్‌ సలహా యిస్తుంది.

ఈ రెండు సంఘటనలనూ చెప్పి, మరింత సానుభూతితో చూడాలని, నీజానీకి వాళ్లు వనిపిల్లలతో నమానమనీ 'ఆమె” అంటుంది.

ఒంగి ఒంగి సలాములు కొట్టే స్థానికులను ఈసడించుకొంటూ “ఆమె” ఒకటి రెండు సంఘటనలను వివరిస్తుంది.

ఆమెభర్త “ఏ-” ముందొకసారి మద్రాసులో పనీ చేసివెళ్లి, ఇప్పుడు మళ్లీ అక్కడికే వచ్చేసరికి, ఆయన్ను చూద్దానికి చాలామంది నేటివులు” వచ్చి పోతుంటారు. 'అయ్యగారి కటాక్షం కోసం వచ్చామాని చెప్పుంటారు. ఒకసారి ఉదయం ఆరుగంటలకు ఒక పెద్దాయన గేటువద్ద బండిదిగి, చెట్టుకింద చెప్పులు వదలి లోపలికొచ్చాదు.

(...తరువాయి 45 వ పుటలో )