పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

166

దంపూరు నరసయ్య


చింతాద్రిపేటలో (.............) రూ|| 10 ల పనిలో చేరినాడు.

పోస్ట్‌కార్డు మీద చిరునామా :

డి. కృష్ణయ్య

Dampur Narasaiah garu, Vennelaganti Gopala Rao's House, Nellore.

Madras, 31-8-1900

క్షేమం

Uncle యిచ్చట క్షేమం. అచ్చటి క్షేమములు తెలుపుతూ రావలెను. యీ శార్వరినామ సంవత్సర భాద్రపద గురువారం మీనలగ్న (........) ఘడియల మీద చి|| నా తమ్ముడగు రఘుపతికి గర్భాదానం ముహూర్తం జరుగునట్లు పెద్దలు నిశ్చయించినారు. గనుక తాము కుటుంబ సమేతంగా వచ్చి వధూవరులను ఆశీర్వదించవలయు (......... ) ప్రార్థించుచున్నాడను. మా అత్తగారు మీనాక్షమ్మను మీతో కూడా పిలుచుకొని వచ్చి కార్యం జరిగించేది. చి|| దొరస్వామి నెమ్మదిగా యుంటున్నాడు. మనవాండ్లు (....................) కనుక కడమ సంగతులు తెలుప (........).

D. Audinarayana

పోస్టు కార్డు మీద చిరునామా : MRRy. Dampoor Narasiah, Editor of "Gramavarthamani", Residing at Nawabpet, Nellore.

అనుబంధం - 11

నెల్లూరు పత్రికారంగానికి ఆద్యుడు దంపూరి నరసయ్య మరికొన్ని జీవిత శకలాలు

నెల్లూరు పత్రికల పుట్టు పూర్వోత్తరాలను గురించి ఒంగోలు వెంకటరంగయ్యగారు సుబోధిని పత్రిక (1933 ఏప్రిల్ సంచిక) లో రాసిన "నెల్లూరు పత్రికల చరిత్ర” అనే వ్యాసమే ఈ నాటికీ ప్రామాణికాధారం. అందులో ఆయన తొలి నెల్లూరు పత్రిక 'నెల్లూరు పయొనీర్' (Nellore Pioneer) అని, అది “గతశతాబ్దపు టరువదియవ దశకాంతమున” వెలువడినదని; దంపూరి నరసయ్య, నంబెరుమాళ్ళయ్య అనే ఇద్దరు కలెక్టరాఫీసు ఉద్యోగులు పత్రికను ప్రారంభించారని వ్రాశారు. అంటే 'పయొనీర్' 1869 ప్రాంతంలో వెలువడి ఉండవచ్చునన్న మాట. అప్పట్లో పత్రికకు ఏమంత ఆదరణ లభించనందువల్ల కాబోలు సంవత్సరం తిరక్కముందే అది ముగిసిపోయింది.

ఈ ఇద్దరు సంపాదకులను గూర్చి వెంకటరంగయ్య గారిచ్చిన వివరణలివి :నంబెరుమాళ్ళయ్య సబ్‌మేజిస్రేటుగా ఉండేవాడట. దంపూరి నరసయ్యకు “వార్తా ప్రచారముగ్గుపాలతో నలవడినటులున్నదం”టారు వెంకటరంగయ్యగారు. నరసయ్య పుట్టి పెరిగింది మద్రాసులో ననిన్నీ, ఆయన చిన్నతనంలోనే మద్రాసులో నేటివ్ అడ్వొకేట్ అనే ఆంగ్ల పత్రిక నడిపారనీ, కొంతకాలం తర్వాత వెంకటగిరి చేరి, రాజగోపాలకృష్ణ యాచేంద్రకు ఇంగ్లీషు ట్యూటరుగా ఉంటూ వచ్చారనీ, అటు తర్వాత కలెక్టరుగారు