పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

161


సారాంశం : బోర్డు సమావేశంలో కోటయ్యసెట్టి అవర్‌గళ్, ఒంగోలు రేంజి డెప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్సు సి. కుప్పుస్వామి అయ్యరు పాల్గొన్నారు.

U. Nellore District Gazette, February 23rd 1884, Municipal Sheet.

సారాంశం : ఒంగోలు సబ్‌కలెక్టరు ఆఫీసులో జరిగిన ఒంగోలు మునిసిపల్ కమిషనర్ల సమావేశంలో కోటయ్యసెట్టి పాల్గొన్నాడు. సభ్యులందరూ 'నామినేటెడ్' అని అనిపిస్తుంది. కోటయ్యసెట్టి అధికార హోదా ఏమిటో పేర్కొనబడలేదు.

V. Nellore District Gazette, October 1st 1901, P 408.

సారాంశం : "List of Assessors and Jurors for 1901 as approved by the Sessions Judge and District Magistrate, Nellore" జాబితాలో రాపూరు ఆదినారాయణయ్య పేరు ఉంది. ఆయన వెలుగోటి ముద్దుకృష్ణ యాచేంద్ర బహదూర్ వద్ద వెంకటగిరిలో శిరస్తదారుగా పనిచేస్తున్నట్లు గెజిటు ప్రకటనలో ఉంది. ఈ జాబితాలో సరస్వతీ నరసింహాచార్యులు, టీచరు, వి.ఆర్. హైస్కూలు, నెల్లూరు పేరు కూడా ఉంది.

W. Nellore District Gazette, October 1st 1901, Local Fund Board Sheet, P-1.

సారాంశం : బోర్డు సమావేశానికి హాజరైన సభ్యుల్లో వెంకటగిరి జమీందారి దివాను బి. మహాదేవయ్య ఉన్నాడు.

X. Nellore District Gazette, October 2nd 1905, P 552 - 554.

సారాంశం : భూమిశిస్తు బాకీలకు సంబంధించి "Notice of attachments" ప్రకటనలో నరసయ్య అక్క భట్టారం మీనాక్షమ్మ కోడూరు గ్రామంలోని పొలాల శిస్తు తాలూకు 27 రూపాయల 14 అణాల 8 పైసలు బాకీ ఉన్నట్లు ఉంది.

అనుబంధం-3

వెంకటగిరి పంచాయితీ ఆఫీసు జనన మరణ రిజిస్టరులో నరసయ్య మరణం గురించి ఇట్లా నమోదైంది. "SL No. 171 దంపూరు నరసయ్య 60 సం||రాలు తూర్పువీధి, వెంకటగిరి. ఆకస్మిక మరణం 28-6-1909". మరణాన్ని రిపోర్టు చేసిన వ్యక్తి “రాపూరు సీతారామయ్య, తమ్ముడు” అని ఉంది.

అనుబంధం-4

నరసయ్య కుమారుడు భట్టారం రాధాకృష్ణయ్య "Family Register" లో తన తల్లితండ్రుల జనన మరణాలను 1928 జనవరి 2వ తారీకు ఈ విధంగా రాసిపెట్టాడు.