పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

160

దంపూరు నరసయ్య


అభిప్రాయంతో విభేదించడమేకాక, ఆడపిల్లలకు విద్య నేర్పడంలో తమ 'అసూయతను' తెలియచేశారు. వెంకటగిరి యూనియన్ స్కూలు కార్యదర్శిమాత్రం స్కూలుపిల్లల జీతాలు తగ్గించాలని, వెంకటగిరిలో స్కూలు ప్రారంభించాలని కోరాడు. నరసయ్య ఈ సమావేశంలో పాల్గొన్నాడు.

P. Nellore District Gazette, May 16th 1874, Local Fund Board Sheet, Page 27 to 29.

సారాంశం : మే 8వ తారీకున బోర్డు సమావేశం జరిగింది. జిల్లా కలెక్టరు వేన్సు ఏగ్నూ అధ్యక్షత వహించాడు. కోటయ్యసెట్టి, నరసయ్య సమావేశంలో పాల్గొన్నారు. ఉదయగిరిలో ఇంగ్లీషు, తెలుగు, హిందుస్థాని బోధించేందుకు ముగ్గురు అధ్యాపకులతో ఒక ఆంగ్లో వర్నాక్యులర్ పాఠశాల ప్రారంభించమని కోరుతూ, తాసిల్దారు ద్వారా, తనకు నేరుగా అందిన అక్కడి ప్రజల అర్జీలమీద సానుకూలంగా తీర్మానం చేయవలసినదిగా సమావేశంలో నరసయ్య కోరాడు. స్కూలు ప్రారంభించి, ముగ్గురు ఉపాధ్యాయులను నియమించడానికి తీర్మానించబడింది.

Q. Nellore District Gazette, August 13th 1874, Local Fund Board Sheet, Page 41.

సారాంశం : ఆగస్టు 8వ తారీకున జరిగిన బోర్డు సమావేశంలో ‘లోకలు ఫండు స్కూళ్ళకు వొక కుటుంబము తాలూకు విశేషమంది చిన్నవాండ్లు వచ్చే యెడల మామూలు ఫీజులో సగమే తీసుకొనేటట్టు ఉత్తర్వు చేయవలసినదిగా నెల్లూరు డిపిటి స్కూలు యినిస్పెక్టరువారు చేసిన దరఖాస్తుకు సభికులలో అనేకులు వొప్పుకోనందున తోసివేయడమైనది.” అని తీర్మానించారు. ఈ సమావేశంలో కోటయ్యసెట్టి, నరసయ్య పాల్గొన్నారు.

R. Nellore District Gazette, June 12th 1875, Local Fund Board Sheet, Page 40.

సారాంశం : బోర్డు సమావేశంలో కోటయ్యసెట్టి, నరసయ్య పాల్గొన్నారు. నరసయ్య ఒంగోలు రేంజి డెప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్సు హోదాలో లోకల్ ఫండ్ బోర్డు సమావేశంలో చివరిసారి పాల్గొన్నాడు. ఆ తర్వాత ఆయన పేరు బోర్డు సమావేశాలలో కనిపించదు, జిల్లా గెజిటులో ఆయన ప్రస్తావన రాదు.

S. Nellore District Gazette, November 25th 1876, Local Fund Board Sheet, Page 85.

సారాంశం : ఒంగోలు రేంజి డెప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్సు హోదాలో సి.ఎస్. నారాయణరావుపంతులు నవంబరు 11వ తారీకున జరిగిన బోర్డు సమావేశంలో పాల్గొన్నాడు. కోటయ్యసెట్టి ఈ సమావేశంలో పాల్గొనలేదు.

T. Nellore District Gazette, November Ist 1879, Local Fund Board Sheet, No. 7.