పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

156

దంపూరు నరసయ్య


అనుబంధం-1

FORT SAINT GEORGE GAZETTE

Fourth Supplement to Fort Saint George Gazette, Friday evening April 29th, 1864, page 889 "University of Madras. Notice. Matriculation Examination, 1864 Narasaya D, Patchiappa's Central School, Madras - Passed in second class"

Page 890 "Anandachari P, Patchiappa's Central institution. Passed in second class"

సారాంశం : Fort Saint George Gazette 1869 Volume, Page 124

Jury rules of the High Court ప్రకారం Special Jurors గా అర్హులైన 200 ఇండియన్ల పేర్ల జాబితా ఉంది. వీరిలో 1."Kistniah, Teacher, Patchiappa's School, Madras - Residence : Black Town, Dumpore - Hindu" అని, 2. "Parthasarathy Sastry, Dampoor, Clerk, Accountant General Office, Madras, Residence: Triplicane, Hindu" అని నరసయ్య అన్నల ఇద్దరి పేర్లు నమోదయ్యా యి. 1869-70 సంవత్సరానికి వీరు జూరర్లుగా నియమించబడ్డారు. ఆ ప్రకటనలోనే జూరర్లకు కావలసిన అర్హత "Qualified by a knowledge of English language and by being possessed of property of an amount of Rs. 3000/-" అని ఉంది.

సారాంశం : Fort Saint George Gazette, November 15th, 1882

ఈ సంచికలో సబ్ రిజిస్ట్రార్లుగా పనిచేయడానికి అర్హతగల షుమారు రెండు వందలమంది పేర్లు ప్రకటించారు. వీరు సబ్ రిజిస్ట్రార్లుగా మాత్రమే కాక, "Notaries Public" గా పని చేయడానికి అర్హులు. వీరిలో D. Krishnayya అని ఒక పేరుంది. పేరు ప్రక్కన చిరునామా, నివాసం, ఇతర వివరాలు ఇవ్వలేదు. బహుశా ఈయన నరసయ్య అన్న కృష్ణయ్య కావచ్చు.

అనుబంధం-2

NELLORE DISTRICT GAZETTE

A. Nellore District Gazette, January 21st 1871, Page 21

"Collector's Office assumed charge - Dampoor Narasaya, Translator, on 4th January 1871." ఈ ప్రకటన తెలుగులో ఇట్లా ఉంది. “కలకటరువారి యిలాకా ఛార్జి పుచ్చుకోవడం - ట్రాన్సులేటరు దంపూరు నరసయ్య, జనవరి తే 4 ది.”