పుట:Endaro Wikimedianlu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆస్కారం లేకుండా రాస్తాడు. అదీ పవన్ పవర్. మంచి వ్యాసం ఎలా ఉండాలి అనే దానికి తెవికీలో ప్రమాణాలు స్థాపించాడు. 2016 ఏప్రిల్ లోనే వంద రోజులు వంద వ్యాసాలు లక్ష్యాన్ని చేరుకుని తెవికీలో ఆ బీజాన్ని నాటాడు. ఆ తరువాత అది అల్లుకుని పది మందికీ అంటుకుంది.

మామూలుగా మలయమారుతం లాగా హాయిగానే వీస్తూంటాడు పవన్. నిర్వాహకత్వ బాధ్యతల్లో భాగంగా దుశ్చర్యలను ఎదుర్కొనేటపుడు, అవసరమైతే వడగాడుపూ కాగలడు. 2023 లో వికీ కాన్ఫరెన్సు, 2024 లో తెవికీ పండగ జరిగినపుడు పవనే ముందు ఉన్నాడు. ముందు ముందు జరిగే పండగలకూ ముందుంటాడు. 2021 ఫౌండేషను బోర్డు ఎన్నికలలో పోటీ చేసాడు.

తెలుగు వికీపీడియా తరఫున ప్రపంచానికి రాయబారి పవన్ సంతోష్.


ఎందరో వికీమీడియన్లు

60