పుట:Endaro Wikimedianlu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎలా తెస్తారు: ఈ సమాచారాన్ననంతటినీ చదివి, తేనెటీగలు మకరందాన్ని సేకరించినట్లు వాటిలోని సారాన్ని సేకరించి తెస్తారు.

ఎవరు తెస్తారు: స్వచ్ఛందంగా పనిచేసే చదువరులు, లేఖకులు

ఎక్కడ చేరుస్తారు: ఇదిగో ఈ వికీపీడియాలో.

వికీపీడియానా.. అంటే?

వికీపీడియా అనే పేరు ఎలా వచ్చిందనే కథాక్రమం బెట్టిదనిన..

చకచక, పకపక, గబగబ, సలసల, టపటప, తపతప అంటూ జమిలి పదాలున్నాయి కదా మనకు. విడిగా వాటికి అర్థం లేదు, కానీ జంటగా చక్కటి అర్థాన్నిస్తాయి. అలాంటి జమిలిపదాలే హవాయీ భాషలో కూడా ఉన్నాయి. వాటిలో వికివికి అనే మాట ఒకటి. దాని అర్థం చకచక/గబగబ అని. ఆశ్చర్యంగా ఉందా? ఔను, నిజమే!

హవాయి విమానాశ్రయంలో ఈ మాట విన్న వార్డ్ కన్నింగ్‌హామ్‌ అనే పెద్దాయనకు అది నచ్చి, 1995 లో తన వెబ్‌సైటుకు ఆ పేరు పెట్టాడు. ఎవరైనా మార్పుచేర్పులు చేసేలా, ఆ మార్పులు కూడా చకచకా చెయ్యగలిగేలా ఆ వెబ్‌సైటును తయారుచేస్తూ దానికి వికివికివెబ్ అని పేరు పెట్టాడు. ఆ వికీ అనే పేరునే తరువాత వికీపీడియాకు కూడా వాడారు. వికివికి+ఎన్‌సైక్లోపీడియా = వికీపీడియా అన్నమాట! 2001లో ఇంగ్లిషులో మొదలైన వికీపీడియా ప్రస్తుతం 326 భాషల్లో ఉంది. తెలుగులో వికీపీడియా 2003 డిసెంబరులో మొదలైంది. మనం దీన్ని గబగబపీడియా అనో చకచకవిజ్ఞానం అనో కూడా అనుకోవచ్చు. తెలుగు వికీపీడియాకు అది ప్రత్యేకం! (చెతురుగా)

వికీపీడియాలో రాసేది ఎవరో ప్రత్యేకంగా అందుకోసం నియమితులైన రచయితలేమీ కాదు. ఉన్నత విద్యావంతులు, శాస్త్రవేత్తలూ ఉన్నారు,

ఎందరో వికీమీడియన్లు

X