76
ఇచ్ఛి నీ కుమారి
జేరఁదీసి తుదముట్టింపవలె నని యున్నదా యేమి ?' అని యడిగెను.
అమ: రాజపుత్రులారా ! మీ రెంతమాత్ర మట్లు తలంపకుఁడు. భీమ రాజుది వెర్రి కోపము. ఒక్కమా ఱు ద్రే కించి యప్పటికప్పుడే యది చల్లాఱును. ఈవిషయము మీ రెఱుఁగనిది కాదు. లోకమున మిక్కిలి ప్రసిద్ధమయిన చాళుక్య వంశమునఁ బుట్టిన మీరు పర రాజులను సేవించుట యతని కిష్టము లేదు. దానివలనఁ జాళుక్యవంశము గౌరవము పోవు నని యతనితలంపు. అందులోఁ జాళుక్య వంశ సంభవులకు, సహజ వై రులగు చోహన వంశజుల సేవించుట మఱింత యవ మానకరము. మీ రీ పృద్వీరాజును సేవించుచున్నా రని యతఁడు మిగుల ఖేదపడుచున్నాఁడు. మిమ్ము తరిమి వేసినం దుల కతఁడు మిక్కిలి పశ్చాత్తాపము చెందుచున్నాఁడు. మి మ్మాదరించి చేరఁదీయవ లెనని తలంచి యారాజు న న్ని చ్చ టీకిఁ బంపెను. ఈనడుమ మీ యన్న లిర్వురును గరుణ రాజు చేఁ జంపఁబడి. రని విని యతఁడు చెందుచున్న విచారమునకు మేరయే లేదు. వీరులారా ! ఈపృథ్వీరాజు మనంశమున కంతటికిని బగ వాఁడు. మీ కీ నడుమ నెట్టియాపగ గల్గిం చెనో మీ రెఱుఁగుదురు. కరుణరా జన్యాయముగా మాయన్న లను జంపుచున్నప్పు డీ రాజు చూచి యూరకుం డెను, వాని వారిం చుటకై నను బ్రయత్నింప లేదు. ఆశ్రయించిన వారిని జంపిం చుట యన్యాయము. ఈ విషయము పృథ్వీరా జెఱుఁగఁ