ప్రక ర ణ ము 14
75
అది చూచి ప్రతాపునితమ్ముఁ డరిసింగు, కరుణ గాజు నెదుర్కొని పోరనారంభించెను. కాని, మహాపరాక్రమశాలి యగు కరుణుని యెదుట నాతఁ డెంతో సేపు నిలువఁబడ లేక పోయెను. అతఁడుగూడ నిహతుఁ డయ్యెను. అందులకు: గినిసి తక్కినసోదరు లైదుగురు ఖడ్గపాణు లై కరుణునిపై గవిసిరి, అది చూచి పృథ్వీరాజు చటాలున లేచి తనపినతండ్రిని వారించి యారాజకుమారులనుగూడ మంచిమాటలాడి యా కలహ మప్పటికిఁ జిల్లా ర్చెను, అకారణక లహమునకుఁ గారకుం డగు పినతండ్రిని జీవాట్లు పెట్టి పృద్వీరా జతనితోఁగూడ నంతఃపురమునకు వెడలిపోయెను. చాళుక్య వంశజులుగూడఁ. గ్రోధవిచారముల చే సంతప్త ములగుహృదయములతోఁ దమ యిండ్లకుఁ బోయిరి. అనంతరము పృథ్వీరాజు వారియిండ్లరుఁ బోయి తగిన మాటలచే వారి విచారము లడఁగించుటకుఁ బ్రయత్నించెను. కాని, భయంకరముగా నుదేకించిన కార్చిచ్చు మంచువాన చేఁ జలాఱునా ? రాజువచనములకు వారికోపము శమింప లేదు. కాని, వారు శాంతులయినట్లు చూపట్టిరి.
ఇది జరిగిన కొంత కాలమునకు ఢిల్లీ పురములో నొక మందిరమున నైదుగురు సోదరులును గూర్చుండిరి. వారి చెంత మఱియొక పురుషుఁ డుండెను. వారు కొంత సేపు మౌనముద్రా ధారులై యుండిరి. అపుడాసోదరులలో నొకఁడు మెల్లగా ‘అమర సింహా ! మాధీను దేవునకు మాయ, దింత యకారణ వాత్సల్య ముదయించుటకు హేతు వేమి ? మంచిమాటలచేఁ