పుట:Ecchini-Kumari1919.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర క ర ణ ము 13

67

రునియాలయమును బ్రవేశించిరి. అభయసిం గది వఱకే వా పంపుట చే నర్చకు లారాకుమారి రాక కై వేచియుండిరి. సవారీ నక్కడ దింపఁగా నే యామె రూపవతితోఁగూడి యాలయ మును బ్ర వేశించెను. సవారీ నుండి పైకి నచ్చునపు డా మె సుందర రూపము నొకమాఱు కన్ను లారఁ గాంచవ లెనని యభయసింగు ప్రయత్నించెను. కాని, తదీయశరీరమంతయు మేల్మునుఁగుచేఁ గప్పఁబడియుండ టవలన నతనిమనోరథము సిద్ధింప లేదు, వారిని వెంబడింప మన స్సెంత పీకుచున్నను మర్యా దకు వెఱచి 'యా రాకుమారుఁ డచ్చట నే నిలిచిపోయెను.

ఇచ్ఛినీకుమారి దేవునికి భక్తి పూర్వకముగ నమస్క- రించి నిమీలితలోచనయై చేతులు జోడించి పలువిధముల నీశ్వ రుని స్తోత్రము చేసి “ఓ దేవా! ఓపర మేశ్వరా ! ఓ భక్త వత్సలా! ఆపన్న లరక్షింప నీకుఁ దక్క నెవ్వరికి శక్తి గలదు, ఇంద్రాదు లునుగూడ నీకరుణా లేశమునకుఁ బాత్రులుగాని చో నిరపాయ ముగా సుఖంపఁజాల రనునప్పుడు మావంటి మనుష్య మాత్రుల సంగతి చెప్ప నేల ! అనాధనాథా ! నీ పాదపద్మములందలి మకరందమును ద్రావుటకు నాచిత్తమధుకరమును బురి కొల్పుము. నీ కిదె నమస్కారముగావించి వేఁడుకొనుచున్న యీదీనురాలిని రక్షింపుము. భక్తు రాల నగు నాకోర్కి దీర్చుట నీకు విహితముగదా ! హాలాహలము చేఁ బీడితులగు దేవతల మొఱ లాలించి యావిషమును మింగి లోకములను గాచిన కరుణాకటాక్షము నీదీనురాలి పై బఱుపుము.మృత్యువు