పుట:Ecchini-Kumari1919.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

ఇచ్చినీ కు మారి

పరమారు . కంతపరాక్రమ హీనుఁడుఁ గాఁడు. ఆబూ రాజ్య మంత గొడ్డువోవ లేదు. లక్షలకొలఁది వీరు లున్నారు. వీరాధి, వీరులగు పదు నెనమండ్రు సామంతప్రభువు లెల్లప్పు డాబూ గడము నఱచేతిలోఁ బెట్టికొని రక్షించుచుండఁగ దీనిని గన్నెత్తి చూచువా రేవ్వరు ? నాకంఠమున జీవితమున్నంత కాలమును నారాజ్యముగాని, నాకుమారిగాని యాభీమునిపో లగుట యసంభనము. మఱియు, నేమహాత్ముఁ డుత్తర గర్భము లోని బాలకునిఁ బరీక్షితుని గాపాడెనో, యేభక్త వత్సలుఁడు దేవేంద్రుఁ డతిభయంకరముగాఁ గురియు జాలవానలవలన గోపాలకులరక్షింపఁగోరి గోవర్ధన గిరి గొడుగువలె ధరించెనో యాపర మేశ్వరు: డా రాధాకాంతుఁడు మమ్ముద్ధరింపక పోఁడు, ఎవఁడు త్రిపు రాసుర గజాసుర భస్మాసుర ప్రముఖులగుదుష్టు లను సంహరించి లోకోపద్రనము లడంచెనో, యేకరుణా కరుఁడు భక్తులకష్టములఁ దొలఁగించి దర్శనమాత్రమున నే మోక్ష మొసంగ నీయాబూపర్వత శిఖరమున నెలకొనెనో యాయచ లేశ్వముఁ దా దేవ దేవుఁడు మమ్ము రక్షింపక పోఁడు' అని నుడివెను.

అతని ధీరవచనములు విని సభ్యులందఱును సంతోష, ముచేఁ బులకిత శరీరులైరి. తావలచిన కస్యకామణి యేమగునో యని యంతవఱకును దడదడ కొట్టుకొనుచున్న చిత్త ముతో నుండిన యభయసింగు పొందిన యానందమునకు మేరయే లేదు. అమరసింహుఁడు రోజునొద్ద సెలవు గైకొని సభ నుండి వెడలిపోయెను.