పుట:Ecchini-Kumari1919.pdf/42

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము 7

39


అనంతరము కొంత సేపటికి జైతునికోపము 'పోయెను. సభచాలించి యంతఃపురమునకుఁ బోయెను. నొక రమణీయ ప్రదేశమునఁ గూగ్చుండి నాఁటి సభానృత్తాం తమును దలపోయ నారంభించెను. జైనమతావలంబియగు భీముఁడు పరమ పవిత్రమగు హిందూమతముచే బుఁడగు తనకూఁతు నడుగుట పెద్దపరాభవముగాఁ దలంచి పర మారుఁడు వికటముగా సమాధానము చెప్పి భీముని రాయ బారిని బంపించి వేయుట మిగులఁ బ్రమాదకర మని దుప్పు డతని మనస్సునకుఁ దట్టెను. అతఁ డెంత ధైర్యవంతుఁ డైన నా విషయము నాలోచించునపు డతని హృదయము చెల్లా చెదరు గాక పోదు. జై తుని రాజ్యము మిగులం. బెద్దదిది కాదు. అతని సైన్యము గూడ స్వల్పమైన దే ! ఎవనితోఁ దాను విరోధ మవలంబిం చెనో యాభీమ దేవుఁడన సామాన్యుఁడు కాడు. అతఁడు మిగులఁ బరాక్రమశాలి.

దానికిదో డపారమగు సైన్యముగలవాఁడు. తలంచిన కార్యము నెఱ వేర్చుకొనుటలో నతనికున్న పట్టుదల వేఱొక రికి లేదు. అట్టి భీమునితో వైరమూనుట పులితోఁ జెలగాటము వంటి దనియు, నతిభయంకరమగు మృత్యువునోటిలోనికోర నూడలాగయత్నించుట వంటి దనియు జై తెపరమారుఁ డెఱుఁ గును. " తానంపిన ప్రత్యుత్తరము విన్నతోడ నే భీముఁడు కోపోద్దీపితుఁ డై యఖండ సై న్యమును గూర్చికొని తన పై కెత్తివచ్చుననియుఁ గొలది కాలములోనె తన రాజధాని పై