పుట:Ecchini-Kumari1919.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర క ర ణ ము -21

119


బహు దిన మెల్ల మనోరథుఁడ వై యారాత్రి ధర్మసత్రములో విడిసి 'తెల్లవాజుఱు జామున లేచి వేఱొక పురమునకుఁ బోవుచుంటిని. నాకంటే ముందుగాఁ గోన్ని గజములదూరమున నడచుచున్న యీ పురు షునితో నితని భార్య 'తా మొనర్చిన ఘన కార్యమునకు రాజు గొప్ప బహుమానము చేయును' అని చెప్పఁగా నది నేను విని ‘ వీరు చేసిన ఘన కార్య .మేమైయుండును ? రాజువలన బహు మాన "మొందఁదగిన కార్య మేమైయుండును ?' అని 'నే నను మానించి యది యేదియో కనుఁగొనవలెనని తలంచి యా వీని ననుసరించి స్నేహము చేసి నాయందు వీనికి నమ్మకము కలుగునట్లు చేసితిని. వీఁడు తనమూటనున్న యీ యుత్త రమునుదీసి నా కిచ్చి తన కం దెంత బహుమాన మిమ్మన్న ట్లున్నదో చెప్పు మని కోరెను. నే నది చదివికొని లోలోపల నమందానందము జెంది వీని నా రాత్రి సౌమిత్రుని యింటికిఁ గొనిపోయి యతనిసాయమున వీని బంధించితిని. వీఁడు గొనిపోవుచున్నం యుత్త రము నమర సింహుఁడనువాఁడు భీమ దేవునకు వ్రాసినది. అని చెప్పి రాజున కి చ్చెను. 'పర మారుఁడు దాని నందుకొని యిటు చదివెను. యన్డిలపుర భూషణమా ! తమయాజ్ఞను శిరసావహించి బై రాగి వేషమున నాబూగడమునకుఁ బోయి రూపవతి సాయమునఁ దమకుఁ బ్రియు రా లగు నిచ్ఛినీకుమారిని గోనినచ్చితిని. ఈ మధుమంత మున రాజభవనములో నామెను బ్రవేశింపఁ జేసి జాగరూక