పుట:Ecchini-Kumari1919.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

ఇ చ్ఛినీ కుమారి

మాఱు గద్దించి యడిగెను. ఎన్ని మాు లడిగినను వాఁడు మౌనియై మిన్నక చూచుచుండెనే కాని యొక ప్రశ్న మునకుఁ బ్రత్యుత్తర మీయ లేదు. డతనిఁ గాంచి నమస్కరించి యుచితమర్యాదలు చేసి కూర్చుండ బెట్టి 'అయ్యా! ఈశ్వర భట్టూ' ! బద్ధుఁడగు నీపురుషుఁ డెవఁడు? వీఁ డెక్కడ లభించెను ! వీఁ డేమియపరాధము చేసెను ? మనయిచ్ఛినిని మోసపుచ్చిన వాడు వీఁడేనా ! ఇచ్చినీ వార్తలు నీ కేమయినఁ దెలిసినవా ? తెలిసినచో నాశుభ వార్త చే నాకు వీనుల విందొనర్పుము' అని మిగులఁ గుతూహ లుఁడై యడుగుచున్న రాజుం గాంచి యీశ్వరభట్టు‘ రాజేందా ! ఇచ్ఛినీకుమారి కనఁబడనినాఁడు తా మనుభ వించుచున్న దుఃఖమును జూచి సహింపలేక యెట్లయినను శక్తి కొలఁది నీయాపత్సమయమునఁ దమకుఁ దోడుపడవ లే' నని యెంచి నల్వురతో పాటు నేను నిచ్ఛినిని వెదకుటకును వెడలి తిని, ఇదివఱలో నిచ్ఛినీకుమారి దన కీయవ లెనని కోరి విఫల మనోరథుఁడయినవాఁ డనైలపుర భీమ దేవుఁడే; కావున, మాయావియగు నతఁడే యీ కన్యాపహరణము చేసియుండు నని యూహించి నేను ఘూర్జర దేశమున కరిగి యందలి పట్ట ణములనృత్తాంతము లరయుచు మధుమంత నునుదుర్గమున కరిగితిని. పగటిపూట నచ్చట నుండి పరిశీలించితిని. కాని, యిచ్ఛినిజాడలు చెప్పువా రెవ్వరును లేరయిరి. నేను విఫల