పుట:Ecchini-Kumari1919.pdf/116

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర క ర ణ ము 20

115


నిలిచిపోయితిని. లోపల నేమిజరిగెనో నా కేమియు బోధపడ లేదు. కొంత సేపటికి నేను బై రాగి చెంత కేగితిని . అచ్చట నిచ్ఛిని కనపడ లేదు. రూపవతిమాత్రమే యుండెను. బై రాగిమాటలవలన రాజకుమారి లోపల 'నేమియో జపించు చున్నట్లుమాత్రము గ్రహించితిని. ఆ బై రాగి రూపవతితో నిచ్ఛినీకుమారిని దుర్గమునకుఁ గొనిపొమ్మని చెప్పి 'యొక వనమూలిక యిచ్చెదను నాతో రమ్మని నన్నొడఁబఱిచి తన వెంటఁ గొనిపోయెను. ఆ రాజకుమారి నొంటిగా విడిచిపోవు టకు సందేహించితిని. కాని, రూపవతి రాజకుమారి కేమియు భయము లేదు నీవుపోవచ్చునని యనుటచే నతని వెబడించి పోయితిని. రూపవతీ - రాజకుమారుల తరువాత వృత్తాంత మేమియో నాకు దెలియదు. ఆదుర్మార్గుడగు బైరాగి యాకొండ పై నన్నుఁ గొంతదూరము గొనిపోయి యొక రాతి పై గూర్చుండఁ బెట్టి 'ఇదిగో! నిప్పుడే వచ్చెద' నని చెప్పి వెడలిపోయెను. అతఁడు వెడలిపోయిన యొక నిముసము న కే పదుగురు మనుజులు వచ్చి నన్నుఁ బట్టుకొని బంధించి యొక కొండగుహలోఁ బడ వైచిరి. అప్పుడు బై రాగి వచ్చి నన్నుఁ జూచి 'ఓయీ ! నిన్ను వదలినచో నీ వాబూగడము నకుఁ బోయి నల్వుర తోను జెప్పి రాజకుమారిని దీసికొని పోకుండ నేదోయాటంకముఁ గల్పింతువు. నీ విట్లే యుండుము' అని పల్కి . నే నేదో మొఱ పెట్టుకొనుచున్నను వినక యా మనుజులతో వెడలిపోయెను, నే నట్లేపడియుండి యాఁకటి చే