పుట:Ecchini-Kumari1919.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

ఇచ్చనీ కుమారి


మెల్లని యతనివలనఁ దనకూతుజాడ లేమయినను దెలియవచ్చునని యనుకొని యత్యాతురతతో నతని సమీపించి 'అభయ సింహా ! ఈరూప మేమి ! నీ కిట్టియాపద యెట్లు సంభవించెను? ఇచ్ఛినీకుమారి యెక్కడ ? నీ వామె కేమయిన నపకారము చేయఁదలంచితివా ! నీవృత్తాంత మున్న దున్నట్లు చెప్పి వేయుము. లేనిచో నీ ప్రాణములు నీకుఁ దక్కవు' అని పలికెను. అది విని యభయసింగు చేతులు జోడించి మెల్లని కంఠస్వరముతో 'మహాప్రభూ ! నాతప్పు మన్నింపుఁడు. నే నిందుఁ జేసిన నేర మేమియును లేదు. ఇచ్చినీకుమారిని బెం డ్లాడవలె నను తలంపు నా కుండెడిది. ఆ రాజకుమారియొద్ద మిక్కిలి చనవు వర్తించుచున్న రూపవతితో నేను స్నేహముఁ జేసి నాయం దామె కనురాగము జనించునట్లు చేయవ లెనని కోరితిని. మాయలాడి యగు నాదుష్టురా లట్లే చేసెద నని చెప్పి నావలన ధనమంతయు లాగి తుదకు నన్ను మోసపుచ్చి యచ లేశ్వరాలయమునకుఁ బోవనున్న రాజ కుమారి కీరాత్రి నీవు సాయము చేయు' మన నే నందుల కంగీక రించితిని. రాజకుమారి సవారీతో వెడలి స్వామిదర్శనార్థము వెళ్ళినది, ఆమె క పాయముగలుగకుండుటకై నేనును ఖడ్గ పాణి నై యామెను 'మెంబడించితిని. స్వామి దర్శనము చేసికొని బై రాగిని జూడఁ దలంపుతో నామె తన్మఠమునకుఁ బోయెను. నేనును బోయితిని. కాని, నన్నుఁ జూచి యామె సిగ్గుపడు నేమో యని తలంచి నేను లోపలి కరుగక ద్వారమునోద్ద నే