పుట:Dvipada-basavapuraanamu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

29

గలయ నొ త్తిన వాలుగడ్డంబుఁ దనరఁ
దపసులరా జొక్కతపసిచందమున
నపుడు మాదాంబకు ననురాగ మెసఁగ
[1] "నిల్ల [2]కప్పడిసంగమేశ్వరం బందు
నెల్లప్పుడును నున్కి. ; యెట్లు లంటేని 780
యేను గూడలి సంగమేశ్వరు పేర
కాన యాగుడిలోనఁ గదల కుండుదును;
నాకొడు కొక్క జన్మమున నితండు ;
లోకహితార్థ మై నీ కుదయించెఁ
గాన వచ్చితిఁ జూడఁగా ; నీభవమున
కేన చూ గురుఁడ నిం కిటమీఁదటికిని
నీనందచునకు లింగానర్పితంబు
లాన సుమీ యించుకంతైనఁ గుడుప"
ననుచు నదృశ్యుఁ డై యరిగె నతండు .
మనసిజహరుఁడు దాఁ జనఁగ నంతటను 790
బాలార్కకోటుల ప్రభలు గీడ్పఱచు
బాలునితేజంబు వర్వుటఁ జేసి
సూచీముఖం బైనఁ జొనుపంగ రాని
యేచినతిమిరంబు నెల్లమానవుల
యజ్ఞానతిమిరంబు నావంత లేక
విజానమయుఁ గని వేగంబ పాయ
వేగక వేగినవిధ మైనఁ జూచి
రాగిల్లె నిఖిలంబు రవి [3] పాఁగె ముడిగె
జననియు జనకుండు సత్పుత్త్రుఁ జూచి
యనురాగరసవార్ధి మునిఁగి యాడుచును 800
భకులఁ బిలువంగఁ బనిచి యిర్వురును

  1. ఇచ్చటి.
  2. జీర్ణవస్త్రములు దాల్చు పరివ్రాజకుఁడు. (అచ్చటి సంగమేశ్వర క్షేత్రమందలి శివలింగమునకు కప్పడి సంగమేశ్వరుఁ డని వ్యవహారము.)
  3. ప్రభ; పొంకము.