పుట:Dvipada-basavapuraanamu.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

244

బసవపురాణము

నక్కిలిపడి ఱెప్ప లల్ల మోడ్చుచును
గ్రుక్కిళ్లు మ్రింగుచుఁ, గుత్తక బంటిఁ
గ్రోలుచు, నలరుచుఁ, గ్రాలుచు. నాత్మ
సోలుచు, సుఖవార్దిఁ దేలుచు, వేడ్క
వ్రాలుచు, మెఱయుచు వక్షంబులందు
నోలిఁ బళ్ళెరముది క్కొయ్యన మరలి
చూచుచు, నించుకించుక పుచ్చికొనుచు,
లేచుచుఁ, జెలఁగుచు లీలఁ దలిర్ప 490
నాడుచుఁ, గప్పెర లఱచేత నొలయఁ
బాడుచు, నుఱుకుచుఁ బరువుపెట్టుచును
మురియుచుఁ, గువియుచు, ముఱకటింపుచును
నొరగాల నిలుచుచు, సరసమాడుచును
నేతెంచి మ్రొక్కుచుఁ జేతులు సాఁచి
ప్రీతిఁ బ్రసాదంబుఁ బెట్టించికొనుచుఁ
గర మనురక్తిమైఁ గౌఁగిలింపుచును
నరుదొందఁ బొత్తుల నారగింపుచును ,
నొండొరుముందట నున్నపళ్ళెరము
లొండొరు లొడియుచు నుబ్బియార్చుచును, 500
విషమాక్షసద్భక్త వితతి యిబ్బంగి
విషమవిక్రమలీల విషకేలి సలుప-
దండి యై బసవనదండనాయకుఁడు
చండేశవరద ప్రసాదశేషంబు
గొట్టరువులవారిఁ గుంచెలవారి
గొట్టుబోయల నాలవట్టాలవారి
పట్టపుదేవుల భ్రాతల హితులఁ
జుట్టాలఁ బక్కాల సుతులఁ బౌత్రులను
బండారులను నడబాళ్ళఁ బ్రెగ్గడల
దండనాయకులను దంత్రపాలకుల 510
దాసజనులను విశ్వాసుల భట్ల