పుట:Dvipada-basavapuraanamu.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

243

కంటిమి కానము వింటిమి వినము
ఉంటిమి లే మను ను క్తులు వలదు ;
అరయంగ నఖిలలోకాలోకములను
బరమేశుభక్తులు పరమపావనులు ;
నద్వితీయుండు వినాకియే కర్త:
సద్విధి నేమె ప్రసాదయోగ్యులము :
ఇట్టిద కాదనునట్టి ద్రోహులకుఁ
గట్టితి నెఱిగెల్తుఁ గాలకూటాగ్ని ; 460
శాపింతు, నఱికింతు, సందుసందులకుఁ
ద్రోపింతు, వాండ్ర నధోగతి " ననుచు
దండియై బసవనదండనాయకుఁడు
చండేశసుతుఁడు శ్రీ సంగమేశునకు
సర్పాంకునకుఁ దద్విషంబు సద్భక్తి
దర్పం బెలర్ప సమర్పణచేసి
పసిగమై నారగింపఁగ నార్చి పేర్చి
వెస ననివారితోద్వృత్తిఁ జెలంగి
యరగలిగొనక కొప్పెరలకు నొరగి
పరమ మాహేశ్వర ప్రకర ముప్పొంగి 470
జుష్టంబు "బ హ్వసి స్తోక మేవాపి
శిష్ట మన్నం విమిశ్రిత” మనుఁ గాన
బసిఁడిగలంతెలఁ బసిఁడిముంతలను
వారక యిటుగూడ వడ్డించికొనుచు
మారారి కర్చించి మహనీయలీలఁ *
శివున కర్పింపుచు శివశివ ! యనుచు
నవధానవంతు లై యారగింపుచును
జుఱ్ఱుజుఱ్ఱనఁగొని సొగయుచు, గఱ్ఱు
గఱ్ఱునఁ ద్రేన్చుచుఁ, గాళ్లు సాఁచుచును, 480
నిక్కుచు నీల్గుచు నక్కిలింపుచును
జొక్కుచు సోలుచుఁ జక్కిలింపుచును