పుట:Dvipada-basavapuraanamu.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

శ్రీమన్మహాభక్త చిరతరవరద
యామృతపూరవిహారనంగాఖ్య !

—: ఏకాంత రామయ్యగారి కథ :—


మఱియు నేకాంత రామయ్య నా నొక్క
నెఱవాది భక్తుండు కఱకంఠమూర్తి
శమదమస్ఫురణానుషక్తుండు జైన
సమయకోలాహలు, డమిత ప్రతాపి
యతులితశివసమయప్రతిపాలుఁ
డతిశయవీరభద్రావతారుండు
నిస్పృహేంద్రియ గుణాన్వీతచేతనుఁడు
నస్పృశ్యభవిజనుఁ డపగతభయుఁడు 10
లింగ సమ్యజ్‌జ్ఞాని లింగావధాని
లింగగంభీరుఁ డభంగురకీర్తి
యేకాంతభక్తి సుశ్లోకుఁడు మర్త్య
లోకపావనుఁడు ద్రిలోకవంద్యుండు
ధీరమహోదారశూరగంభీర
సారగుణస్తోమధౌరేయుఁ డనఁగ
నెగడి నిత్యక్రియానియంతప్రయుక్త
దగిలి శివార్చనాంతమున నత్యర్థిఁ
బ్రమథలోకమున కుద్యమలీల నరిగి
విమలాత్మవీరక వీరభద్రాది 20
గణనికాయములకుఁ బ్రణమిల్లి వారి
గుణకీర్తనలు సేసి కోర్కి దైవాఱ
శివభక్తి తత్వానుభవ సదేకాంత