పుట:Dvipada-basavapuraanamu.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠా శ్వాసము

199

సవిశేషసుఖసుధాశరధి నోలాడి
యెప్పటియ ట్లిల కెలమి నేతెంచి
ముప్పూఁట నిమ్మార్గమునఁ జరింపంగ
బసవనిభక్తి సంపత్సముద్రంబు
దెసల ధరాస్థలి దివి నిట్టవొడువ
స్వచ్ఛుండు సందర్శనేచ్చ నేతెంచి
ప్రచ్ఛన్నయుక్తి నబ్బసవనిఁ జూచి 30
“యాకటకమునందు నేకాంతరాముఁ
డేకాక యై చరియించుచు నుండ
నొక్క జైనుఁడు సెప్పు లూడ్వక వచ్చి
చక్కన శివనివాసంబు జొచ్చుడును
లోపల రామయ్య గోపించి చూచి
యీపాపమున కింక నేగుఱి గలదు
రోరి : జైనుఁడ ! తగ దుడురాజధరు' న
గారాంతరముఁ జెప్పుఁగాళ్ళఁ జొరంగఁ :
గడవఁ జొచ్చితి నని మృడునకుఁ జాఁగఁ
బడి మ్రొక్కు చెప్పులు వాఱంగ వైచి 40
యటుగాక తక్కిన నంతకోద్దండ
పటుదండ బాధలపా లై తి పొమ్ము
ఇంకఁ జెప్పులతోన యి ట్లుంటివేని
శంకింప కిప్పుడ సందుసందులకు
నఱకుదు" ననవుడుఁ బిఱుసన కతఁడు
“నఱిముఱి నింతేల యాగ్రహించెదవు ?
ముక్కంటిగుళ్ళకు దిక్కు గల్గితివి
నిక్కపుభక్తుండ : నీ కేల వెఱతు ?
గుడి వసదియ ; వేల్పులొడయండు జినుఁడు ;
నుడువకు; కాదేనిఁ బడయుమా మగిడి 50
దల దర్గి యిప్పుడ మలహరుచేత :
నిల నీవె భక్తుండ వితఁడె వే"ల్పనిన